News March 13, 2025
సెకండియర్ పరీక్షకు 299 మంది గైర్హాజరు: కలెక్టర్ తేజస్

సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలలో భాగంగా బుధవారం ఇంటర్ మీడియట్ సెకండ్ ఇయర్ పరీక్షను నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 7,616 మంది విద్యార్థులకు గాను 7,317 మంది పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. 299 మంది గైర్హాహరైనట్లు వెల్లడించారు.
Similar News
News March 28, 2025
నేడు ప.గో జిల్లాలో పవన్ పర్యటన

AP: Dy.CM పవన్ కళ్యాణ్ ఇవాళ ప.గో జిల్లాలో పర్యటించనున్నారు. తమ కుటుంబ మూలాలున్న మొగల్తూరు, పెనుగొండ గ్రామాల అభివృద్ధికి ఆయన ఆలోచన చేస్తున్నట్లు జనసేన పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. నేడు ఉదయం మొగల్తూరు, సాయంత్రం పెనుగొండలో గ్రామ అభివృద్ధి సభలు నిర్వహించనున్నారు. అన్ని శాఖల అధికారులు, గ్రామస్థులతో సమావేశమవుతారు. అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పనపై చర్చించి, ప్రజలు ఇచ్చే అర్జీలను స్వీకరిస్తారు.
News March 28, 2025
కలెక్షన్లలో ‘L2: ఎంపురాన్’ రికార్డు

పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మోహన్‌లాల్ హీరోగా నటించిన ‘L2: ఎంపురాన్’ దేశవ్యాప్తంగా తొలి రోజు ₹21కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది. దీంతో తొలి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ సినిమాగా రికార్డు నెలకొల్పింది. ఇంతకముందు ఈ రికార్డు పృథ్వీరాజ్ ‘ది గోట్ లైఫ్’ (₹8.95cr) పేరిట ఉండేది. ‘లూసిఫర్’కు సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా నిన్న థియేటర్లలో రిలీజైన సంగతి తెలిసిందే. మీరు ఈ మూవీ చూశారా? ఎలా ఉంది?
News March 28, 2025
సంగారెడ్డి: భార్య సూసైడ్‌కు కారణమైన భర్తకు జైలు శిక్ష

ఆత్మహత్యకు ప్రేరేపించిన వ్యక్తికి ఐదు సంవత్సరాలు జైలు శిక్ష, వెయ్యి రూపాయల నిర్మాణ విధిస్తూ సీనియర్ సివిల్ జడ్జి డాక్టర్ ఎం రాధాకృష్ణ చౌహన్ గురువారం తీర్పు ఇచ్చారు. ఇస్మాయిల్‌కన్‌పేటకు చెందిన లక్ష్మయ్య మద్యానికి బానిసై భార్య యాదమ్మను వేధించేవాడు. మద్యం తాగి వచ్చి భార్యను వేధిడంతో 2019లో ఆత్మహత్య చేసుకుంది. ఈకేసులో నేరం నిరూపణ కావడంతో నిందితుడికి జైలు శిక్ష విధిస్తూ జడ్జి తీర్పు ఇచ్చారు.