News August 29, 2024
సెకండ్ ఏఎన్ఎంలను రెగ్యులర్ చేయాలని సీఎంకు వినతి

రాష్ట్రంలో నేషనల్ హెల్త్ మిషన్ స్కీంలో దాదాపు 6 వేల మంది సెకండ్ ANMలు పనిచేస్తున్నారని వీరందరినీ రెగ్యులర్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు తోట రామాంజనేయులు, ఏఐటీయూసీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఎం నరసింహ కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇతర రాష్ట్రాల్లో సెకండ్ ANMలను రెగ్యులర్ చేశారని.. మన రాష్ట్రంలో కూడా సెకండ్ ANMలను రెగ్యులర్ చేయాలన్నారు.
Similar News
News February 11, 2025
నల్గొండ: విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

నేరడిగొమ్ము మండలం పెద్దమునిగల్ గ్రామ శివారులో విషాదం జరిగింది. పోలీసుల వివరాలిలా.. గ్రామానికి చెందిన రైతు కేతావత్ చెన్నా పొలం దగ్గర ఓ వ్యక్తి కరెంట్ షాక్‌తో చనిపోయాడు. అడవి పందుల రక్షణ కోసం ఏర్పాటు చేసిన కరెంట్ తీగ తగలడంతో ఈ విషాదం జరిగింది. మృతిచెందిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
News February 11, 2025
దామరచర్ల పీహెచ్సీని తనిఖీ చేసిన ఇలా త్రిపాఠి

ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలలో వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించడంతో పాటు రికార్డులన్నింటినీ సక్రమంగా నిర్వహించాలని NLG కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. సోమవారం ఆమె దామరచర్ల పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది వైద్యుల హాజరు రిజిస్టర్, మందుల రిజిస్టర్లను, అలాగే స్టాక్ తదితర రిజిస్టర్లు అన్నిటిని తనిఖీ చేశారు.
News February 11, 2025
తగ్గుతున్న నాగార్జునసాగర్ నీటిమట్టం

నాగార్జునసాగర్ జలాశయంలో నీటి నిల్వలు వేగంగా తగ్గిపోతున్నాయి. సోమవారం సాయంత్రానికి స్పిల్ వే(546 అడుగులు) దిగువకు 543.80 అడుగులకు పడిపోయింది. పూర్తిస్థాయి నీటిమట్టం 593 అడుగులు కాగా.. ప్రస్తుత 543 అడుగులకు చేరింది. మరోవైపు ఎడమ కాలువకు ఆన్ ఆఫ్ విధానంలో నీటిని విడుదల చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. కానీ రైతుల డిమాండ్ మేరకు కుడి, ఎడమ కాలువలకు ఏకధాటిగా నీటిని విడుదల చేస్తూనే ఉన్నారు.