News March 19, 2025

సెన్సార్లు అమర్చాలని అనకాపల్లి కలెక్టర్ సూచన 

image

పరిశ్రమలలో రసాయనాల లీకేజ్ లను గుర్తించే సెన్సార్లను బయట లోపల అమర్చాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ సూచించారు. కలెక్టరేట్లో జిల్లా సంక్షోభ నివారణ కమిటీ సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. పరిశ్రమలలో ప్రమాదాలు జరిగితే సమాచారాన్ని వెంటనే జిల్లా యంత్రాంగానికి తెలియ చేయాలన్నారు. జిల్లాలో గల 12 రసాయన పరిశ్రమలలో మాక్ డ్రిల్ నిర్వహించాలన్నారు.

Similar News

News November 28, 2025

4 వారాలుగా అనుమతించట్లేదు: ఇమ్రాన్ ఖాన్ సోదరి

image

జైలులో ఉన్న తన సోదరుడు ఇమ్రాన్ ఖాన్‌ను 4 వారాలుగా కలవనివ్వట్లేదని సోదరి నొరీన్ నియాజీ తెలిపారు. ఆయన ఆరోగ్యం పట్ల ఆందోళన నెలకొందన్నారు. ‘ఇమ్రాన్ ఖాన్ విషయంలో ఏం జరుగుతుందో తెలియట్లేదు. జైలు అధికారులు ఏం చెప్పట్లేదు. మా సోదరుడిని చంపేసినట్లు వార్తలొస్తున్నాయి’ అని వాపోయారు. అంతకుముందు ఖైబర్‌ పఖ్తుంఖ్వా CM సోహైల్ రావల్పిండిలోని జైలు ముందు బైఠాయించి ఇమ్రాన్ ఖాన్‌కు మద్దతుగా నిరసన తెలిపారు.

News November 28, 2025

వేములవాడ పోలీసుల అదుపులో నిందితుడు సంతోశ్..!

image

మాజీ నక్సలైట్ బల్లెపు నర్సయ్య అలియాస్ సిద్ధయ్య హత్య కేసులో నిందితుడిగా భావిస్తున్న జక్కుల సంతోశ్ వేములవాడ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. తాను అజ్ఞాతంలో ఉండగా ఎందరినో చంపినట్లుగా నర్సయ్య ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో పేర్లతో సహా చెప్పడంతో తన తండ్రిని నర్సయ్య చంపినట్లుగా నిర్ధారణకు వచ్చిన సంతోశ్ యూట్యూబ్ ఛానల్ కోసం ఇంటర్వ్యూ కావాలంటూ నర్సయ్యను పిలిపించి హతమార్చినట్లు పోలీసులు భావిస్తున్నారు.

News November 28, 2025

బాపట్ల: పరీక్షల షెడ్యూల్ రద్దు..!

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆధ్వర్యంలో డిసెంబర్ 8 నుంచి నిర్వహించాల్సిన పీజీ పరీక్షల షెడ్యూల్‌ను రద్దు చేసినట్లు పరీక్షల నిర్వహణ అధికారి శివప్రసాదరావు తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం పరీక్ష ఫీజు చెల్లించవచ్చని సూచించారు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి సూచన మేరకు పీజీ పరీక్షలు జరిగే తేదీలను త్వరలో ప్రకటిస్తామని చెప్పారు.