News August 31, 2024

సెప్టంబర్ 11నుంచి ఉచిత ఇసుక నూతన విధానం: కలెక్టర్ స్వప్నిల్

image

ఉచిత ఇసుక నూతన విధానాన్ని వచ్చేనెల 11నుంచి అమలు చేస్తున్నామని గనులశాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా అన్నారు. ఇసుక విధానంపై శుక్రవారం సచివాలయంలో మైనింగ్ శాఖాధికారులతో కలసి ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్లతో మాట్లాడారు. జిల్లా నుంచి స్వప్నిల్ దినకర్, JC ఫర్మాన్ అహ్మద్ హాజరయ్యారు. ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నెంబర్ 18005994599, dmgapsandcomplaints@yahoo.com ఈమెయిల్‌లను ఉపయోగించాలన్నారు.

Similar News

News September 15, 2024

SKLM: ఇక మండలానికి ఒక్క MEO ఉండనున్నారా..?

image

వైసీపీ ప్రభుత్వ హయాంలో మండలానికి ఇద్దరు ఎంఈఓలు విధానానికి తాజాగా కూటమి ప్రభుత్వం స్వస్తి పలకనుందనే సంకేతాలు కనిపిస్తాయి.. ఇక ఒక్క ఎంఈఓతోనే మండల విద్యాశాఖను పర్యవేక్షణ చేపట్టనున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా ప్రభుత్వం స్కూల్ కాంప్లెక్స్‌లను పటిష్ఠం చేయనుంది. జిల్లాలోని శ్రీకాకుళం,టెక్కలి,పలాస డివిజన్ల పరిధిలోని 38 మండలాల్లో ఇక ఒక్కరే ఎంఈఓ ఉండనున్నారు అనే సమాచారం జిల్లా అధికారులకు చేరింది.

News September 15, 2024

నరసన్నపేట: మద్యం సీసాలో బొద్దింక

image

మద్యం సీసాలో బొద్దింకని చూసి మందుబాబు నివ్వెరపోయాడు. కోమర్తి గ్రామానికి చెందిన అప్పన్న నరసన్నపేట బండివీధి సమీపంలో ఓ ప్రభుత్వ దుకాణంలో ఈ నెల 12న మద్యంసీసా కొనుగోలు చేశాడు. అనంతరం పరిశీలించగా అందులో బొద్దింక కనిపించింది. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఎక్సైజ్ సీఐ లక్ష్మి వద్ద ప్రస్తావించగా తమ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే, వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు.

News September 15, 2024

శ్రీకాకుళం: రేపు ఫిర్యాదులు స్వీకరణ రద్దు

image

రేపు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్ధ (మీకోసం) వినతుల స్వీకరణ కార్యక్రమం లేదని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ప్రతి సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న మీకోసం వినతుల స్వీకరణ కార్యక్రమం రేపు మిలాదిన్ నబీ ప్రభుత్వ సెలవు దినం సందర్భంగా వినతుల స్వీకరణ కార్యక్రమం సెప్టెంబరు 16న నిర్వహించడం లేదని ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.