News September 17, 2024
సెప్టెంబర్ 21న వర్చువల్ సేవల కోటా విడుదల

తిరుమలలో వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన డిసెంబరు నెల కోటాను సెప్టెంబరు 21న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. డిసెంబరు నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను సెప్టెంబరు 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన డిసెంబరు నెల ఆన్ లైన్ కోటాను సెప్టెంబరు 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది.
Similar News
News September 16, 2025
చిత్తూరు జిల్లాలో లక్ష సంతకాలు సేకరిస్తాం: భాస్కర్

దేశంలో ఓటర్ల జాబితాలో అవకతవకలపై చేపడుతున్న ఉద్యమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పోటుగారి భాస్కర్ పిలుపునిచ్చారు. చిత్తూరులో ఆయన మాట్లాడుతూ.. ఓటు చోరీపై చిత్తూరు జిల్లాలో లక్ష సంతకాల సేకరిస్తామని చెప్పారు. ప్రతి పార్టీ బీజేపీకి బానిసలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. జీడీ నెల్లూరు ఇన్ఛార్జ్ రమేశ్, నేతలు పాల్గొన్నారు.
News September 16, 2025
చిత్తూరు DCMS ఛైర్మన్ మృతి

చిత్తూరు డీసీఎం ఛైర్మన్, టీడీపీ చంద్రగిరి మండల అధ్యక్షుడు పల్లిమేమి సుబ్రహ్మణ్యం నాయుడు మంగళవారం తెల్లవారుజామున మృతిచెందారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నెల రోజులుగా చికిత్స పొందుతున్నారు. కోలుకోలేక తుది శ్వాస విడిచారు. ఆయన మృతికి పలువురు టీడీపీ నాయకులు సంతాపం తెలిపారు.
News September 16, 2025
చిత్తూరు: 19న మెగా జాబ్ మేళా

చిత్తూరు జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ నెల 19వ తేదీన మెగా ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి పద్మజ ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం మూడు ప్రముఖ కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. టెన్త్, ఇంటర్, డిప్లొమా, ఐటీఐ, డిగ్రీ, ఎంబీఏ, ఎంకాం, పీజీ, డీ, బీ ఫార్మసీ పూర్తి చేసిన వారు అర్హులన్నారు. నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.