News August 13, 2024

సెబ్ పెండింగ్ కేసులపై సమీక్షించిన ప్రకాశం ఎస్పీ

image

ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో మంగళవారం సెబ్ అధికారులతో ఎస్పీ దామోదర్ పెండింగ్ కేసులపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. .. జిల్లాలో నాటుసారా తయారీ, రవాణాను పూర్తి స్థాయిలో అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. నాటుసారా కాచే పాత నేరస్తులపై నిఘా కొనసాగించాలని, అవసరమైతే పిడి యాక్ట్ అమలుకు ప్రతిపాదనలు అధికారులు పంపాలన్నారు.

Similar News

News September 7, 2024

కురిచేడు: పలు రైళ్లు రద్దు

image

గిద్దలూరు- దిగువమెట్ట మధ్య రెండో లైను పనులు జరుగుతున్న కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు గుంటూరు మండల రైల్వే అధికారి తెలిపారు. ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు గుంటూరు- కాచిగూడ (17251), గుంటూరు – డోన్ (17228) ను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ప్రయాణికులు గమనించాలన్నారు.

News September 7, 2024

ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు: ఎస్పీ

image

జిల్లా ప్రజలకు, పోలీసు అధికారులకు, సిబ్బందికి, మీడియా మిత్రులకు ఎస్పీ దామోదర్ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, మత సామరస్యం కొనసాగించాలని సూచించారు. జిల్లా ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని, అందరి జీవితాల్లో విఘ్నాలు తొలగిపోయి విజయాలు సిద్ధించాలని ఆకాంక్షించారు.

News September 7, 2024

ఒంగోలులో కొబ్బరికాయలతో 17 అడుగుల గణనాథుడు

image

ఒంగోలులోని సమతానగర్‌లో కొబ్బరి కాయలతో గణనాథుడిని తయారుచేశారు. గత 30 ఏళ్లుగా స్థానిక ‘కమిటీ కుర్రాళ్లు’ గణేష్ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. కాగా ఈ ఏడాది సరికొత్తగా దాదాపు 1500 కొబ్బరికాయలతో 17 అడుగుల ఎత్తులో గణేష్‌ను రూపొందించారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ హితానికి ముందుకు రావాలని కోరారు.