News April 16, 2025
సెలవుల్లో.. ములుగు స్వాగతం పలుకుతోంది!

వేసవి సెలవులకు ములుగు జిల్లా స్వాగతం పలుకుతోంది. సెలవుల్లో కుటుంబ సమేతంగా పచ్చని అడవుల్లో ఆహ్లాదకర వాతావరణంలో టూర్ ప్లాన్ చేసుకునేలా మంచి వేదిక కానుంది. వెంకటాపూర్లోని రామప్ప దేవాలయం, గోవిందరావుపేటలోని లక్నవరం సరస్సు, వేలాడే వంతెనలు, తాడ్వాయిలోని మేడారం సమ్మక్క-సారలమ్మ, మంగపేటలోని మల్లూరు నరసింహస్వామి పర్యాటక ప్రాంతాలు సందర్శించి, పచ్చని చెట్ల మధ్య విందు చేస్తూ ఆహ్లాదం పొందవచ్చు.
Similar News
News December 1, 2025
శివుడు పుర్రెల దండ ఎందుకు ధరిస్తాడు?

పరమ శివుడు పుర్రెల దండ, చితాభస్మం ధరించి శ్మశానంలో తిరుగుతుంటాడు. అందుకు కారణం శిష్టరక్షణ. అసురులు ధర్మబద్ధంగా వరాలు పొంది దేవతలను హింసించేవారు. వారిని మోహానికి గురి చేయడానికి విష్ణుమూర్తి ఆజ్ఞ మేరకు శివుడు ఈ వేషం ధరించి, పాషండ మతాన్ని ఉపదేశించాడు. దీంతో వేద నింద, దైవ నింద చేసిన రాక్షసుల తేజస్సు క్షీణించింది. అలాగే వారి నుంచి దేవతలకు ఉపశమనం లభించింది. ఇది ధర్మ రక్షణకై హరిహరులు చేసిన లీల.
News December 1, 2025
కృష్ణా: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్

ప్రయాణికుల రద్దీ మేరకు ఉమ్మడి కృష్ణా మీదుగా అనకాపల్లి(AKP)-సికింద్రాబాద్(SC) మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.07041 SC-AKP రైలు డిసెంబర్ 7 నుంచి 28 వరకు ప్రతి ఆదివారం, నం.07042 AKP-SC రైలు డిసెంబర్ 8 నుంచి 29 వరకు ప్రతి సోమవారం ప్రయాణిస్తాయన్నారు. ఈ రైళ్లు ఉమ్మడి కృష్ణాలో విజయవాడ, గుడివాడ, కైకలూరులో ఆగుతాయని చెప్పారు.
News December 1, 2025
నిర్ణీత వ్యవధిలో సమస్యలు పరిష్కారం: సబ్ కలెక్టర్

నూజివీడు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయ ఆవరణంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం నిర్వహించారు. సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మీకోసం కార్యక్రమంలో ప్రజల నుంచి అందించే అర్జీలలోని సమస్యలను నిర్ణయిత వ్యవధిలో పరిష్కరించాలని సూచించారు. అన్ని శాఖలకు చెందిన అధికారులు సకాలంలో హాజరు కావాలన్నారు.


