News December 12, 2024
సెలవు ఇవ్వకపోతే కఠిన చర్యలు: తిరుపతి జేసీ

భారీ వర్షాల కారణంగా తిరుపతి జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు ఇన్ఛార్జ్ కలెక్టర్ శుభం బన్సల్ శుక్రవారం సెలవు ప్రకటించారు. ఎవరైనా పాఠశాలలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గూడూరు, సూళ్లూరుపేట నియోజకవర్గాలతో పాటు వెంకటగిరి, డక్కిలి, బాలాయపల్లె మండలాలకు మాత్రమే సెలవు వర్తిస్తుంది. నెల్లూరు జిల్లాలో సెలవుపై అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు.
Similar News
News December 13, 2025
టెక్నికల్ సర్టిఫికెట్ కోర్స్ పరీక్ష ఫీజు చెల్లించాలి: DEO

హ్యాండ్లూమ్, టైలరింగ్, డ్రాయింగ్, ఎంబ్రాయిడరీ లోయర్, హయ్యర్ గ్రేడ్ టెక్నికల్ సర్టిఫికెట్ కోర్స్కు సంబంధించిన పరీక్షలను జనవరిలో నిర్వహిస్తున్నట్లు డీఈవో ఆర్ బాలాజీ రావు ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఈనెల 27వ తేదీలోగా ఆయా విభాగాలకు సంబంధించిన నిర్దేశించిన ఫీజులను ఆన్లైన్ ద్వారా చెల్లించాలని కోరారు.
News December 13, 2025
తిరుపతి చేరిన నెల్లూరు రాజకీయం.?

నెల్లూరు మేయర్ స్రవంతి అవిశ్వాస తీర్మాన ఘట్టం పొలిటికల్ హీట్ పెంచింది. 18న ఎలాగైనా అవిశ్వాస తీర్మానాన్ని నెగ్గాలని మంత్రి నారాయణ, MLA కోటంరెడ్డి గట్టిగా ప్రయత్నిస్తున్నారట. ఇప్పటికే దాదాపు 37 మంది కార్పొరేటర్లు TDPకి మద్దతు పలుకుతుండగా వారిని తిరుపతికి తరలించినట్లు సమాచారం. జగన్ సమక్షంలో చేరిన ఐదుగురు కార్పొరేటర్లలలో మరో ఇద్దరు TDP చెంతకు వచ్చారు. అవిశ్వాసం నెగ్గాలంటే 38 సభ్యులు కావాలి.
News December 13, 2025
నెల్లూరు: ఏడాదిపాటు లేడీ డాన్ అరుణకు నో ఛాన్స్.!

లేడీ డాన్ నిడిగుంట అరుణ బయటికి వస్తే మళ్లీ నేరాల బాట పట్టే అవకాశం ఉందని, అందుకే పీడీ యాక్ట్ నమోదు చేశామని పోలీసులు స్పష్టం చేశారు. ఈ యాక్ట్ ద్వారా ఆమెకు ఏడాది పాటు బెయిల్ రాదని.. ఎవరినీ కలిసే అవకాశం ఉండదన్నారు. బెయిల్ కావాలంటే హైకోర్టుకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. ములాఖాత్ కోసం హోం ప్రిన్సిపల్ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుందన్నారు.


