News September 1, 2024
సెల్ఫీల కోసం వాగుల వద్దకు వెళ్లొద్దు: ఎస్పీ ఉదయ్
యువకులు సెల్ఫీల కోసం వరద ప్రవాహాల వద్దకు వెళ్లే లాంటి ప్రయోగాలు చేయకూడదని మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. జిల్లాలో ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయని అన్నారు. లోతట్టు ప్రాంతాల్లోని రహదారుల వంతెనలపై నీరు ప్రవహిస్తుండడంతో అటువైపుగా ఎవరు వెళ్ళకూడదని చెప్పారు. సమస్యలు ఉంటే వెంటనే 8712657888కి సమాచారం ఇవ్వాలన్నారు.
Similar News
News September 17, 2024
టేక్మాల్: మోడీ చిత్రపటానికి శాలువా కప్పి విషెష్
టేక్మాల్ మండల కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలను వినూత్నంగా నిర్వహించారు. మండల బీజేపీ పార్టీ అధ్యక్షుడు డాకప్పగారి నవీన్ గుప్తా, బీజేపీ జిల్లా మహిళ మోర్చా ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల మల్లికా అశోక్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి శాలువా కప్పి సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నేతలు అశోక్, కొయిలకొండ దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
News September 17, 2024
MDK: ముగ్గురు వైద్య సిబ్బంది సస్పెండ్
కౌడిపల్లి ఆరోగ్య కేంద్రంలో ముగ్గురు వైద్య సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది. కౌడిపల్లి ఆస్పత్రిని నేడు మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ తనిఖీ చేశారు. సిబ్బంది రమేష్, రాధాకృష్ణ, అహ్మద్ షకీల్ హాజరు పట్టికలో సంతకం చేసి విధుల్లో లేకపోవడంతో ఆ ముగ్గురు సిబ్బందిని సస్పెండ్ చేస్తూ డీఎంహెచ్ఓ డా. శ్రీరామ్ ఉత్తర్వులు జారీ చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని కలెక్టర్ హెచ్చరించారు.
News September 17, 2024
సంగారెడ్డి: 1200 మంది పోలీసులతో బందోబస్తు
సంగారెడ్డి జిల్లాలో ఈనెల 17న జరిగే వినాయక నిమజ్జనానికి 1200 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ రూపేష్ సోమవారం తెలిపారు. నిమజ్జనాన్ని చూసేందుకు వచ్చే ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ప్రధాన కూడళ్ల వద్ద పికెట్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వినాయక మండప నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని కోరారు. డీఎస్పీల పర్యవేక్షణలో నిమజ్జన కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు.