News May 11, 2024
సెల్ ఫోన్‌లు అనుమతి లేదు: కర్నూలు కలెక్టర్

పోలింగ్ కేంద్రాల్లోకి సెల్ ఫోన్ల అనుమతి లేదని కర్నూలు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ జి.సృజన శుక్రవారం పేర్కొన్నారు. ఓటు వేసేందుకు వచ్చే ఓటర్లు తమవెంట సెల్ ఫోన్లు తీసుకురావొద్దని సూచించారు. ఎన్నికల కేంద్రంలో ప్రిసైడింగ్ ఆఫీసర్ (పీఓ)కు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. ఈ విషయాన్ని ఓటర్లు గమనించాలని కోరారు.
Similar News
News March 16, 2026
కర్నూలు జిల్లాలో మొదటి రోజే 1042 మంది విద్యార్థులు గైర్హాజరు

కర్నూలు జిల్లా వ్యాప్తంగా సోమవారం జరిగిన పదో తరగతి పరీక్షల్లో 1042 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఈవో సుధాకర్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 35851 మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్షకు హాజరు కావలసి ఉండగా.. 34809 మంది విద్యార్థులు హాజరయ్యారు. 702 మంది ప్రైవేట్ విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సిందిగా 650 మాత్రమే హాజరయ్యారు. 52 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఆయన తెలిపారు.
News March 16, 2026
కర్నూలు జిల్లాలో గ్యాస్ కొరత లేదు: JC

కర్నూలు జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత లేదని జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో సుమారు 11వేల సిలిండర్లు నిల్వలో ఉండగా, అదనంగా 7వేల సిలిండర్లు చేరుకున్నాయన్నారు. ప్రతిరోజు సగటున 10వేల సిలిండర్లు వినియోగదారులకు పంపిణీ జరుగుతోందన్నారు. గ్యాస్ కొరతపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. ఏజెన్సీలు ఇబ్బందులు కలిగిస్తే 1967 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలన్నారు.
News March 16, 2026
కర్నూలు: పోలీస్ పరిష్కార వేదికకు 102 వినతులు

వినతులు అందించిన వారికి విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తామని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. సోమవారం ఎస్పీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన పోలీస్ పీజీఎస్ఆర్‌లో మొత్తం 102 ఫిర్యాదులు స్వీకరించారు. ఉద్యోగ మోసం, భూ వివాదాలు, ప్లాట్ రిజిస్ట్రేషన్ సమస్యలు, ఫైనాన్స్ తదితర అంశాలపై ప్రజలు వినతులు అందించారు. ప్రతి ఫిర్యాదును చట్ట ప్రకారం పరిశీలించి బాధితులకు న్యాయం చేస్తామన్నారు.


