News April 21, 2025
‘సేంద్రియ విధానంల సాగు శుభ పరిణామం’

నిజామాబాద్‌లోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో రైతు అనుబంధ సంఘాలు సోమవారం రైతు మహోత్సవ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సేంద్రియ విధానంలో రైతులు పంటలు సాగు చేయడం శుభ పరిణామం అన్నారు. జిల్లా అధికారులు, మంత్రులు, కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, 5 జిల్లాల నుంచి రైతులు పాల్గొన్నారు.
Similar News
News April 22, 2025
‘ఫసల్ భీమా’ యోజన అమలు చేయాలి: ఎమ్మెల్సీ

తెలంగాణ ప్రభుత్వం ప్రధానమంత్రి ‘ఫసల్ భీమా’ యోజన పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి అన్నారు. సోమవారం నిజామాబాద్ జిల్లా రైతు సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. రైతులు అకాల వర్షాల కారణంగా తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం తక్షణమే తగిన పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఫసల్ బీమా యోజన అమలు చేస్తే ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతులకు మేలు జరుగుతుంది అంజిరెడ్డి అన్నారు.
News April 22, 2025
గిల్-సాయి జోడీ అదుర్స్

గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ అదరగొడుతున్నారు. తొలి వికెట్‌కు మంచి భాగస్వామ్యం నమోదు చేస్తూ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటి వరకు 8 ఇన్నింగ్సుల్లో 2 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలతో సహా మొత్తం 448 పరుగుల పార్ట్‌నర్‌షిప్ అందించారు. ఈ ఏడాది ఐపీఎల్‌లో ఇప్పటి వరకు ఇవే అత్యధికం. ఆ తర్వాతి స్థానాల్లో RCB నుంచి కోహ్లీ-సాల్ట్(315), SRH నుంచి హెడ్-అభిషేక్(314) ఉన్నారు.
News April 22, 2025
లక్షెట్టిపేట: యాక్సిడెంట్.. ఒకరి మృతి

లక్షెట్టిపేట మండలంలోని ఎల్లారం గ్రామ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ మునుగంటి చంద్రశేఖర్(51) మృతి చెందాడని ఎస్సై సురేశ్ తెలిపారు. చంద్రశేఖర్ ఆదివారం మధ్యాహ్నం పౌరోహిత్యం ముగించుకొని వెంకట్రావుపేటకు వెళ్లే క్రమంలో ఎల్లారం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారన్నారు. ఆయనను కుటుంబ సభ్యులు హైదరాబాద్ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు చెప్పారు.