News March 22, 2025

సేంద్రియ వ్యవసాయంపై దృష్టి సారించాలి: బాపట్ల కలెక్టర్

image

వ్యవసాయం, మత్స్య సంపద ఉత్పత్తుల విస్తీర్ణంతో ఆదాయం వృద్ధి అయ్యే లక్ష్యంగా అధికారులు ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ వెంకట మురళి తెలిపారు. వివిధ శాఖల అధికారులతో శనివారం బాపట్ల కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. వ్యవసాయ రంగంలో వృద్ధిరేటు 10.70శాతం లక్ష్యంతో అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చెప్పారు. రసాయన ఎరువులు, పురుగు మందులు లేని సేంద్రియ వ్యవసాయంపై దృష్టి సారించాలన్నారు.

Similar News

News April 20, 2025

తండ్రి మందలించాడని..

image

పుట్టపర్తి మండలం గువ్వలగుట్టపల్లి గ్రామానికి చెందిన వరలక్ష్మి అనే విద్యార్థిని తండ్రి మందలించడంతో ఆత్మహత్యకు  పాల్పడ్డారు. మండలంలోని జగరాజుపల్లి ఆదర్శ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న వరలక్ష్మి శనివారం స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లారు. ఇది తెలిసిన తండ్రి వెంకటేశ్ కూతురిని మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.

News April 20, 2025

వక్ఫ్ ఆస్తులను కొట్టేసేందుకు కేంద్రం కుట్ర: ఒవైసీ

image

వక్ఫ్ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకునేంత వరకు తగ్గేదే లేదని MIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. హైదరాబాద్ దారుసలాంలో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ చట్టంతో వక్ఫ్ బోర్డ్ ఆస్తులను కొట్టేసేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని ఆరోపించారు. కేంద్రం నిర్ణయంతో ముస్లింల సమాధులకూ స్థలాలు ఉండబోవని ఆందోళన వ్యక్తం చేశారు. ఏప్రిల్ 30 నుంచి నిరసనలు చేపడతామన్నారు.

News April 20, 2025

DSC: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఖాళీలు ఎన్నంటే?

image

రాష్ట్రంలో 16,347 పోస్టులతో ఇవాళ ఉదయం 10 గంటలకు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడనుంది. ప్రకాశం జిల్లాలో 72 ఎస్ఏ పీఈటీ, 106 ఎస్జీటీ పోస్టులతో కలిపి మొత్తం 629 ఖాళీలను ప్రభుత్వం భర్తీ చేయనుంది. అలాగే గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలకు సంబంధించి 26 ఎస్జీటీ పోస్టులతో కలిపి జిల్లాలో 43 పోస్టులు ఉన్నాయి.

error: Content is protected !!