News March 6, 2025
సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి: బాపట్ల కలెక్టర్

సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి తెలిపారు. సేంద్రీయ వ్యవసాయం వార్షిక ప్రణాళికపై అనుబంధ శాఖల అధికారులతో గురువారం బాపట్ల కలెక్టరేట్లో ఆయన సమావేశం నిర్వహించారు. రసాయన ఎరువులు, పురుగుమందులు వినియోగం లేకుండా పంటలు సాగు చేయాలని కలెక్టర్ అన్నారు. సాంప్రదాయ పద్ధతిలో సాగు చేస్తేనే ప్రజల ఆరోగ్యం కాపాడగలమన్నారు.
Similar News
News November 27, 2025
కోరుట్ల: నామినేషన్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు

జగిత్యాల జిల్లాలో సర్పంచ్ నామినేషన్ల సందర్భంగా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా SP అశోక్ కుమార్ తెలిపారు. కోరుట్ల పరిధిలోని ఐలాపూర్, పైడిమడుగు కేంద్రాలను డీఎస్పీతో కలిసి పరిశీలించారు. నామినేషన్ కేంద్రాల వద్ద 100 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని చెప్పారు. అభ్యర్థులు అనుమతి పొందిన వాహనాలు, లౌడ్స్పీకర్లే వినియోగించాలని సూచించారు. డీఎస్పీ రాములు, సీఐ సురేష్, ఎస్ఐలు పాల్గొన్నారు.
News November 27, 2025
ఏలూరు: సీఎం పర్యటనపై టెలి కాన్ఫరెన్స్ నిర్వహించిన కలెక్టర్

డిసెంబర్ 1వ తేదీన ఉంగుటూరు మండలంలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులతో గురువారం టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈమేరకు కలెక్టర్ మాట్లాడుతూ.. డిసెంబర్ 1వ తేదీన ఉంగుటూరు మండలంలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొంటారన్నారు. అందుకు సంబంధించి ఆయా ప్రదేశాలలో పూర్తిస్థాయి ఏర్పాట్లు చెయ్యాలని అధికారులను ఆదేశించారు.
News November 27, 2025
GHMCలో విలీనం.. 2 రోజుల్లో GO?

జీహెచ్ఎంసీలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను విలీనం చేస్తామని సర్కారు ప్రకటించడంతో సర్వత్రా ఇదే చర్చనీయాంశమైంది. విలీనానికి సంబంధించి ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా ప్రభుత్వ ఉత్తర్వులు (GO) 2 రోజుల్లో విడుదల చేయనున్నట్లు సమాచారం. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా విలీన ప్రక్రియ ముగించాలని సీఎం ఆదేశించారు.


