News March 6, 2025

సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి: బాపట్ల కలెక్టర్ 

image

సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి తెలిపారు. సేంద్రీయ వ్యవసాయం వార్షిక ప్రణాళికపై అనుబంధ శాఖల అధికారులతో గురువారం బాపట్ల కలెక్టరేట్‌లో ఆయన సమావేశం నిర్వహించారు. రసాయన ఎరువులు, పురుగుమందులు వినియోగం లేకుండా పంటలు సాగు చేయాలని కలెక్టర్ అన్నారు. సాంప్రదాయ పద్ధతిలో సాగు చేస్తేనే ప్రజల ఆరోగ్యం కాపాడగలమన్నారు.

Similar News

News January 19, 2026

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 93 అర్జీలు

image

కర్నూలు ఎస్పీ క్యాంపు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 93 ఫిర్యాదులు అందాయి. డీఐజీ, జిల్లా ఇన్‌ఛార్జి ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఫిర్యాదుపై త్వరితగతిన విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ హుస్సేన్ పీరా, పలువురు సీఐలు పాల్గొన్నారు.

News January 19, 2026

రాష్ట్రంలో 140 పోస్టులు.. దరఖాస్తు చేశారా?

image

శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీలో 140 పోస్టులకు అప్లై చేయడానికి జనవరి 31 ఆఖరు తేదీ. మొత్తం పోస్టుల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ 79, అసోసియేట్ ప్రొఫెసర్ 44, ప్రొఫెసర్ 17 ఉన్నాయి. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ, PhDతో పాటు బోధన, రీసెర్చ్ అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. వెబ్‌సైట్: https://skltghu.ac.in/

News January 19, 2026

అనకాపల్లి: పీజీ ఆర్ఎస్‌కు 91.. రెవెన్యూ క్లినిక్‌కు 218 అర్జీలు

image

అనకాపల్లి కలెక్టరేట్‌లో సోమవారం పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను నిర్వహించారు. కలెక్టర్ విజయ్ కృష్ణన్ పాల్గొని అర్జీలను స్వీకరించారు. పీజీఆర్ఎస్‌కు 91, రెవెన్యూ క్లినిక్‌కు 218 అర్జీలు వచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. అర్జీదారులు సంతృప్తి చెందే విధంగా అర్జీలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.