News January 31, 2025
‘సేఫ్టీ అవేర్నెస్’ ప్రారంభించిన HYD ఇన్‌ఛార్జ్ మంత్రి

సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. HYDలోని హెచ్ఎండీఏ గ్రౌండ్స్ ఎన్టీఆర్ మార్గ్‌లో రోడ్ సేఫ్టీ అవేర్నెస్ కార్యక్రమానికి ఆయన హాజరై జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రహదారి భద్రత మనందరి బాధ్యత అని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను రక్షించాలన్నారు.
Similar News
News February 24, 2026
మరికొన్ని గంటల్లో HYDలో భారీ వర్షం

నగరంలోని పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే కొన్ని గంటల్లో నగరమంతా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లో తీవ్రత ఎక్కువగా ఉండవచ్చని మ్యాప్ విడుదల చేసింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని అధికారులు సూచించారు.
News February 23, 2026
RR: ఉగ్గుపాల నుంచే ఒగ్గు కథల వైపు మల్లారి!

ఒగ్గు కథ చెప్పడం మగాళ్లకే పరిమితమైన రోజుల్లో ఓ మహిళ కథ చెప్పడానికి బయలుదేరింది. రంగారెడ్డి(D),యాచారం(M), నక్కర్త మేడిపల్లికి చెందిన జమ్మ మల్లారి. ఈమె వేలకొద్దీ బీరప్ప కళ్యాణాలు చేసి, ఒగ్గు కథలు వినిపించి ఒగ్గుకథ ‘సూపర్‌స్టార్’గా ఎదిగారు. జీవితాన్ని ఒగ్గుకథకు అంకితం చేసి తొలి మహిళా ఒగ్గు కథా కళాకారిణిగా పేరుగాంచి 2020లో విశిష్ట మహిళా పురస్కారాన్ని అందుకుని FEB 7న ఆమె శివైక్యం చెందారు.
News February 23, 2026
రంగారెడ్డి: ఇంటర్ పరీక్షలకు 200 కేంద్రాలు..!

ఈనెల 25 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లాలో 200 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు అధికారి వెంక్యానాయక్ తెలిపారు. 84,301 మంది ప్రథమ సంవత్సరం, 70,171 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. ఉ.9 గంటల నుంచి మ.12 గంటల వరకు పరీక్ష ఉంటుందని, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు.


