News February 28, 2025
సేవలను మరింత మెరుగుపరచాలి: విశాఖ జేసీ

ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందే సేవలను మరింత మెరుగుపరచాలని జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ వీసీ హాలులో వారితో సమావేశమైన ఆయన వివిధ అంశాలపై మార్గదర్శకాలు జారీ చేశారు. ఉచిత గ్యాస్, రేషన్ బియ్యం పంపిణీ, తూనికలు, కొలతలు ఇతర ప్రమాణాలు పాటించే క్రమంలో జాగ్రత్తలు వహించాలని చెప్పారు.
Similar News
News November 13, 2025
విశాఖ చేరుకున్న గవర్నర్ అబ్దుల్ నజీర్

విశాఖ వేదికగా నిర్వహించే సిఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొనేందుకు గవర్నర్ అబ్దుల్ నజీర్ గురువారం సాయంత్రం చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్లో ఆయనకు కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, సిపి శంఖబ్రత బాగ్చి, మేయర్ పీలా శ్రీనివాసరావు పుష్పగుచ్చం అందజేసీ స్వాగతం పలికారు. అక్కడ నుంచి గవర్నర్ విడిది కేంద్రానికి వెళ్లారు. అయితే ఈ సదస్సులో పాల్గొనేందుకు ఇప్పటికే సీఎం చంద్రబాబు, పలువురు మంత్రులు నగరానికి చేరుకున్నారు.
News November 13, 2025
రైతులతో సోలార్ ప్లాంట్ల ఏర్పాటు యోచన: CM

రాష్ట్రంలో రైతులతో సోలార్ ప్లాంట్ల ఏర్పాటు యోచనలో ఉన్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. వ్యవసాయానికి యోగ్యం కాని భూములు, బీడు భూముల్లో రైతులు సోలార్, విండ్ విద్యుత్ ఉత్పత్తి చేస్తే ఎంతమేర లాభదాయకంగా ఉంటుందని CMచంద్రబాబు రెన్యూ పవర్ చైర్మన్ సుమంత్ సిన్హాతో చర్చించారు. సోలార్ ప్యానెల్స్ ధరలు అధికంగా ఉన్నందున వాటి తయారీ యూనిట్లు రాష్ట్రంలో పెద్దఎత్తున నెలకొల్పేందుకు ప్రోత్సహిస్తామని CM వెల్లడించారు.
News November 13, 2025
4 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి హీరో గ్రూప్ ఎంఓయూ

4 గిగావాట్ల పునరుద్పాతక విద్యుత్ రంగంలో పెట్టుబడులకు హీరో ఫ్యచర్ ఎనర్జీస్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. రూ.15వేల కోట్ల వ్యయంతో అనంతపురం, కడప, కర్నూలులో విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ సంస్థ ముందుకొచ్చింది. సంస్థ సీఎండీ రాహుల్ ముంజాల్ గురువారం సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యి ఈడీబీ ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామన్నారు.


