News February 12, 2025
సేవాలాల్ జయంతికి నియోజకవర్గ ఇంఛార్జీల నియమకం

సంత్ సేవాలాల్ 286 జయంతి కోసం నియోజకవర్గ జిల్లా అధికారులను నియోజకవర్గ ఇన్ఛార్జిలుగా నియమించినట్లు కలెక్టర్ మంగళవారం తెలిపారు. సంగారెడ్డికి డీఆర్డీవో జ్యోతి, పటాన్ చెరుకు జిల్లా మైనార్టీ అధికారి దేవుజ, జోగిపేటకు ఆర్డీవో పాండు, నారాయణఖేడ్‌కు ఆర్డీవో కల్యాణ చక్రవర్తి, జహీరాబాద్‌కు ఆర్డీవో రాంరెడ్డిను నియమించినట్లు చెప్పారు.
Similar News
News September 18, 2025
నాగాయలంక: పూడ్చిన శవానికి పోస్ట్ మార్టం.. అసలేమైంది.!

నాగాయలంక (M) నాలి గ్రామానికి చెందిన నాయుడు డానియేల్ బాబు (19) గత నెల 28న అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకుని చనిపోయాడు. అతని కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఖననం చేశారు. అయితే, డానియేల్ తల్లి ఫిర్యాదు మేరకు అవనిగడ్డ DSP విద్యాశ్రీ, తహశీల్దార్, సీఐ సమక్షంలో పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి, పోస్టుమార్టం నిర్వహించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తోంది.
News September 18, 2025
పెళ్లి పేరుతో మోసం చేసిన ఆర్మీ ఉద్యోగిపై కేసు నమోదు: SI

సంతకవిటి పోలీస్ స్టేషన్లో గురువారం ఓ ఆర్మీ ఉద్యోగిపై కేసు నమోదైంది. SI గోపాలరావు తెలిపిన వివరాలు ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ఓ ఆర్మీ ఉద్యోగి కొన్నేళ్లుగా ఆమెను శారీరకంగా వాడుకున్నాడు. తర్వాత ముఖం చాటేశాడని, దీంతో ఆర్మీ ఉద్యోగిపై సదరు యువతి గురువారం సంతకవిటి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని SI పేర్కొన్నారు.
News September 18, 2025
కొండాపూర్: గులాబీ మొక్కకు పూసిన విద్యుత్ దీపాలు

కొండాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో ఒక అద్భుత దృశ్యం కెమెరాకు చిక్కింది. ఒక గులాబీ మొక్కకు పువ్వులకు బదులుగా నక్షత్రాలు వికసించినట్లుగా ఆ చిత్రం ఉంది. గులాబీ మొక్కకు దూరంలో ఉన్న రెండు ఇళ్ల విద్యుత్ దీపాలు కెమెరాకు ఇలా కనిపించాయి. ఈ చిత్రాన్ని చూసి చాలా మంది వీద్యుత్ దీపాలు గులాబీ మొక్కకు వికసించినట్లు ఉన్నాయని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.