News February 12, 2025

సేవాలాల్ జయంతికి నియోజకవర్గ ఇంఛార్జీల నియమకం

image

సంత్ సేవాలాల్ 286 జయంతి కోసం నియోజకవర్గ జిల్లా అధికారులను నియోజకవర్గ ఇన్‌ఛార్జిలుగా నియమించినట్లు కలెక్టర్ మంగళవారం తెలిపారు. సంగారెడ్డికి డీఆర్డీవో జ్యోతి, పటాన్ చెరుకు జిల్లా మైనార్టీ అధికారి దేవుజ, జోగిపేటకు ఆర్డీవో పాండు, నారాయణఖేడ్‌కు ఆర్డీవో కల్యాణ చక్రవర్తి, జహీరాబాద్‌కు ఆర్డీవో రాంరెడ్డిను నియమించినట్లు చెప్పారు.

Similar News

News March 24, 2025

‘ఉమ్మడి MBNR జిల్లాలో ఎయిర్పోర్ట్ నిర్మించండి’

image

దిల్లీలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును నాగర్ కర్నూల్ ఎంపీ మల్లురవి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు ఎయిర్పోర్ట్ నిర్మించాలని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణలో పెద్ద విస్తీర్ణం గల జిల్లా మహబూబ్నగర్ అని గుర్తు చేసి, ఇక్కడ ఎయిర్పోర్టు నిర్మించడంతో రవాణా సౌకర్యం, ప్రజలకు ఉపాధి లభిస్తుందని కోరారు.

News March 24, 2025

సీఎం పుట్టినరోజున ‘చంద్రన్న నాటకోత్సవాలు’

image

AP: వచ్చే నెల 20న సీఎం చంద్రబాబు పుట్టినరోజు పురస్కరించుకొని వారం పాటు ‘చంద్రన్న నాటకోత్సవాలు’ నిర్వహించనున్నట్లు ఏపీ నాటక అకాడమీ ప్రకటనలో పేర్కొంది. ఏప్రిల్ 20-26 వరకు జరిగే వేడుకల్లో నాటికలు, పౌరాణిక/సాంఘిక నాటకాలు, పద్య నాటకాలను జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రదర్శిస్తామని పేర్కొంది. ఆసక్తిగలవారు వివరాలు, సాధించిన విజయాలు, ప్రదర్శించే నాటక వివరాలను వెల్లడిస్తూ నాటక <>అకాడమీ చిరునామాకు<<>> పంపాలని కోరింది.

News March 24, 2025

రేపు 52 మండలాల్లో వడగాలులు

image

AP: రాష్ట్రంలో రేపు 52, ఎల్లుండి 88 మండలాల్లో <>వడగాలులు<<>> వీచే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది. రేపు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, కాకినాడ, తూ.గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలకు ALERT జారీ చేసింది. ఎండదెబ్బ తగలకుండా జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించింది. అలాగే పలు ప్రాంతాల్లో అకాల వర్షాలతోపాటు పిడుగులు పడే ఛాన్స్ ఉందని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

error: Content is protected !!