News February 7, 2026
సేవాలాల్ జయంతికి ప్రత్యేక బస్సులు: జేసీ విష్ణుచరణ్

శ్రీ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. అనంతపురం కలెక్టరేట్‌లో ఆయన మాట్లాడుతూ.. గుత్తి – గుంతకల్లు మధ్య సేవాగఢ్ వద్ద బస్సుల నిలుపుదలకు చర్యలు తీసుకోవాలన్నారు. భక్తుల రద్దీని బట్టి అదనపు బస్సులు కేటాయించాలని సూచించారు. జయంతి వేడుకలకు వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News March 17, 2026
బ్యాంకర్లు రుణాల లక్ష్యాలు పూర్తి చేయాలి: కలెక్టర్

అనంతపురంలో జరిగిన జిల్లాస్థాయి సమీక్షా సమావేశంలో కలెక్టర్ ఆనంద్ బ్యాంకర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల రుణాలను నిర్దేశిత లక్ష్యాల మేరకు పూర్తి చేయాలని సూచించారు. ముద్ర, స్వానిధి, పీఎంఈజీపీ వంటి పథకాలలో పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలన్నారు. నిర్లక్ష్యం వహించిన బ్యాంకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News March 17, 2026
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలి: జగన్

ఉగాది, శ్రీ రామనవమి పండుగలకు అనంతపురం జిల్లాకు విచ్చేయాలని వైఎస్ జగన్‌ను బీసీ సెల్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి రమేశ్ గౌడ్ ఆహ్వానించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జగన్‌ను, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిని ఆయన కలిశారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి వహించాలని జగన్ ఆయనకు సూచించారు.
News March 17, 2026
వడగాల్పులపై అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్

అనంతపురం జిల్లా రెవెన్యూ భవన్‌లో ‘వేసవి వడగాల్పుల కార్యచరణ ప్రణాళిక-2026’పై కలెక్టర్ ఆనంద్ సమీక్ష నిర్వహించారు. వడదెబ్బ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. జిల్లాలో 534 చలివేంద్రాలు ఏర్పాటు చేసి తాగునీరు, మజ్జిగ అందిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు మధ్యాహ్నం ఎండలో తిరగకుండా జాగ్రత్తలు పాటిస్తూ ఎక్కువగా నీరు, మజ్జిగ తీసుకోవాలని సూచించారు.


