News February 12, 2025
సేవాలాల్ జయంతిని దేశవ్యాప్తంగా నిర్వహించాలి: హుస్సేన్

సద్గురు శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ సేవలను గుర్తిస్తూ.. ఫిబ్రవరి 15న ఆయన జయంతిని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా దేశవ్యాప్తంగా నిర్వహించేలా ప్రత్యేక చొరవ తీసుకోవాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ అన్నారు. ఈ విషయమై ఆయన కేంద్ర మంత్రి కిషన్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. సేవాలాల్ జయంతికి సంబంధించి GO విడుదలకు కృషి చేయాల్సిందిగా వినతిలో పేర్కొన్నారు.
Similar News
News November 22, 2025
పాలమూరు: నేటి నుంచి డిగ్రీ పరీక్షలు ప్రారంభం

పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని అన్ని డిగ్రీ కళాశాలల్లో 1, 3, 5 సెమిస్టర్ (రెగ్యూలర్, బ్యాక్లాగ్) డిగ్రీ పరీక్షలు నేటి (శనివారం) నుంచి ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు. మొదటి సెమిస్టర్, మూడో సెమిస్టర్ విద్యార్థులకు ప్రతిరోజూ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, ఐదో సెమిస్టర్ విద్యార్థులకు ప్రతిరోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి.
News November 22, 2025
జనగామ: ఆదర్శం.. ఈ విశ్రాంత ఉపాధ్యాయుడు!

ఉద్యోగ విరమణ పొందిన దేవరుప్పుల మండలం కామారెడ్డిగూడెంకు చెందిన శ్రీరామ్ రాజయ్య తాను పదవీ విరమణ పొందిన పాఠశాలలోనే విరమణ లేని విశ్రాంత ఉపాధ్యాయుడిగా బోధిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. గతేడాది అక్టోబర్లో కడవెండి ఉన్నత పాఠశాలలో బయోసైన్స్ ఉపాధ్యాయుడిగా విరమణ పొందారు. ఏడాది నుంచి అదే పాఠశాలలో ఉచితంగా పాఠాలు చెబుతున్న ఆయన్ను జనగామ అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్ అభినందించారు.
News November 22, 2025
జనగామ: రేపు ఎన్ఎంఎంఎస్ పరీక్ష

జనగామ, స్టేషన్ ఘనపూర్లో ఆదివారం ఎన్ఎంఎంఎస్ (నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్) నిర్వహించనున్నారు. జిల్లా వ్యాప్తంగా 4 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 729 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష జరగనుంది. సీసీటీవీ పర్యవేక్షణలో పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు.


