News June 24, 2024

సైకిల్‌పై పార్లమెంటుకు విజయనగరం MP

image

విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు నేడు ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఢిల్లీలోని అతిథి గృహం నుంచి సైకిల్‌పై పార్లమెంట్‌కు బయలుదేరారు. ముందుగా ఆయన తన తల్లికి పాదాభివందనం చేసి పార్లమెంటుకు వెళ్లారు. ఈ కార్యక్రమానికి పలువురు ఎచ్చెర్ల నియోజకవర్గ టీడీపీ నేతలు హాజరయ్యారు.

Similar News

News July 11, 2025

సారవకోట: ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఆటో..ఒకరి మృతి

image

సారవకోట(M) కృష్ణాపురం సమీపంలో రహదారిపై గురువారం ఆగి ఉన్న లారీను వెనక నుంచి ఆటో బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్‌తో పాటు నలుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను హుటాహుటిన శ్రీకాకుళం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. అమ్మనమ్మ (56) మృతి చెందింది. మరో నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

News July 11, 2025

శ్రీకాకుళం జిల్లా టుడే టాప్ న్యూస్ ఇవే

image

✯ మెళియాపుట్టి: విద్యుత్ షాక్ తో 5వ తరగతి విద్యార్థి మృతి
✯మందసలో అధికారులను అడ్డుకున్న రైతులు
✯ విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే రవికుమార్
✯ సారవకోట: లారీని ఢీకొన్న ఆటో.. ఐదుగురికి తీవ్ర గాయాలు
✯ కళింగపట్నంలో పనులను పరిశీలించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
✯ పలాస: గంజాయితో ముగ్గురు అరెస్ట్
✯ కంచిలి: అధ్వానంగా ఆసుపత్రి పరిసరాలు
✯ టెక్కలి: శాకాంబరీదేవిగా శివదుర్గ అమ్మవారు

News July 10, 2025

మెళియాపుట్టి: విద్యుత్ షాక్‌తో విద్యార్థి మృతి

image

మెళియాపుట్టి మండలం గొప్పిలిలో గురువారం సాయంత్రం విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన 5వ తరగతి విద్యార్థి మహేష్ (9) తన ఇంటి మేడపై మొక్కను నాటేందుకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు విద్యుత్ తీగ తగిలి షాక్‌కు గురై తీవ్ర గాయాలపాలయ్యాడు. విగతజీవిగా పడిన ఉన్న బాలుడుని కుటుంబీకులు ఆస్పుత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు చెప్పారు.