News March 31, 2025
సైదాపురం ఎంపీడీవోకు తప్పిన ప్రాణాపాయం

మనుబోలు జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో సైదాపురం ఎంపీడీవో పురుషోత్తం శివ కుమార్కు ప్రాణాపాయం తప్పింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గూడూరు ప్రయాణిస్తున్న కారును నెల్లూరు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఎంపీడీవోకు స్వల్ప గాయాలు కాగా సమాచారం అందుకున్న మనుబోలు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News April 10, 2025
లేబర్ సిస్టం రద్దుపై కలెక్టర్ సమావేశం

జిల్లా కలెక్టర్ తమిమ్ అన్సారీయా లేబర్ సిస్టం రద్దు నిర్ణయంపై జిల్లాలోని అన్ని శాఖల అధికారులతో ఒంగోలులోని స్పందన భవనంలో గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ నిర్ణయం వల్ల ప్రజలకు కలిగే ప్రయోజనాలు, ఎదురయ్యే సవాళ్లు, ఇతర అంశాల గురించి చర్చించారు. లేబర్ సిస్టం రద్దు వల్ల కార్మికుల హక్కులు, రక్షణలు కచ్చితంగా కల్పించబడతాయన్నారు. కార్యక్రమంలో కార్మిక ఉప కమిషనర్ గాయత్రి దేవి పాల్గొన్నారు.
News April 10, 2025
కొండగట్టులో ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

ప్రముఖ కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో రేపటి నుంచి జరగబోయే చిన్న జయంతి ఉత్సవాలకు సంబంధించి చేపట్టిన ఏర్పాట్లను ఈ రోజు సాయంత్రం జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ లు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా శాఖల అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీకాంత్ రావు, డిఎస్పి రవిచందర్, సీఐ నీలం రవి, తదితరులు పాల్గొన్నారు.
News April 10, 2025
రైతుల కోసం కొత్త పథకం: మంత్రి తుమ్మల

TG: రైతుల కోసం ‘గ్రామ గ్రామానికి జయశంకర్ వ్యవసాయ వర్సిటీ నాణ్యమైన విత్తనం’ పథకాన్ని తీసుకొస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. జూన్లో CM రేవంత్ ఈ స్కీమ్ను ప్రారంభిస్తారని తెలిపారు. ప్రతి గ్రామంలో ముగ్గురు నుంచి ఐదుగురు రైతులకు జూన్ మొదటి వారంలో ఈ పథకం కింద విత్తనాలు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. సుమారు 40వేల మంది రైతులకు 2500-3500 క్వింటాళ్ల విత్తనాలను అందజేస్తామన్నారు.