News February 11, 2025

సైదాపూర్: ఎవరి లెక్క ఏంటో తేలాలని రాహుల్ అప్పుడే అన్నారు: మంత్రి పోన్నం

image

కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన దేశానికే మార్గదర్శకమని బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. మంగళవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఎవరి లెక్క ఏంటో తేలాలని రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలోనే  స్పష్టం చేశారన్నారు. బీఆర్ఎస్, బీజేపీ దొందు దొందే, రాంగ్ డైరెక్షన్‌లో పోయేలాగా ఈ రెండు పార్టీలు ప్రవర్తిస్తున్నాయన్నారు.

Similar News

News March 20, 2025

KNR జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు

image

KNR జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. గడచిన 24 గంటల్లో అత్యధికంగా గంగాధర మండలంలో 38.9°C నమోదు కాగా, జమ్మికుంట 38.7, చిగురుమామిడి 38.2, శంకరపట్నం 38.0, కరీంనగర్ రూరల్ 37.9, గన్నేరువరం 37.7, మానకొండూర్ 37.6, తిమ్మాపూర్ 37.3, వీణవంక 37.2, రామడుగు 37.0, కరీంనగర్ 36.7, కొత్తపల్లి 36.0, హుజూరాబాద్ 35.5, ఇల్లందకుంట 35.4, చొప్పదండి 35.0, సైదాపూర్ 34.6°C గా నమోదైంది.

News March 20, 2025

జగిత్యాల: ప్రేమ పేరుతో బాలికకు వేధింపులు.. పురుగు మందు తాగి ఆత్మహత్య

image

జగిత్యాల జిల్లాలో ఓ బాలికను ప్రేమ పేరుతో ఓ యువకుడు, బాలుడు వేధించగా ఆమె పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై రవికిరణ్ వివరాల ప్రకారం.. పెగడపల్లి మండలం రామభద్రునిపల్లికి చెందిన బాలికను అదే గ్రామానికి చెందిన రాము అనే యువకుడు, రంగదామునిపల్లికి చెందిన మరో బాలుడు ప్రేమ పేరుతో వేధించారు. అది భరించలేక ఈనెల 15న బాలిక పురుగుల మందు తాగగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది.

News March 20, 2025

బడ్జెట్.. ఉమ్మడి కరీంనగర్‌కు కేటాయింపులు ఇలా..

image

రాష్ట్ర ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో KNR స్మార్ట్ సిటీ పనులకోసం రూ.179కోట్లు కేటాయించింది. అదేవిధంగా SUకి రూ.35కోట్లు, స్పోర్ట్స్ స్కూల్‌కు రూ.21కోట్లు, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌కు రూ.349.66కోట్లు, వరదకాలువల పనులకు 299.16కోట్లు, కాళేశ్వరం రూ.2,685కోట్లు, మానేరు ప్రాజెక్ట్‌కు రూ.లక్ష, బొగ్గులవాగు(మంథని)రూ.34లక్షలు, రామడుగు, గోదావరి బేసిన్‌కు రూ.2.23కోట్లను కేటాయించింది.

error: Content is protected !!