News March 27, 2025

సైదాపూర్: తాడిచెట్టుపై నుంచి పడి వ్యక్తి మృతి

image

తాడిచెట్టు పై నుంచి పడి వ్యక్తి మృతిచెందిన ఘటన సైదాపూర్ మండలం ఘనపూర్ గ్రామంలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. గ్రామస్థుల వివరాల ప్రకారం.. ఘనపూర్ గ్రామానికి చెందిన ఆకుల కనుకయ్య (53) అనే గీతకార్మికుడు తాటికల్లు తీయడానికి రోజూలాగే చెట్టు ఎక్కగా ప్రమాదవశాత్తు జారిపడి అక్కడిక్కడకే మృతి చెందాడు. కనకయ్య మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Similar News

News September 15, 2025

KNR: ‘ప్రజావాణి దరఖాస్తులకు ప్రథమ ప్రాధాన్యత’

image

సోమవారం ప్రజావాణి కార్యక్రమానంతరం జిల్లా అధికారులతో పలు అంశాలపై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి వేగవంతంగా పరిష్కరిస్తున్నామని అన్నారు. 2021 ఫిబ్రవరి నుంచి 27580 దరఖాస్తులు రాగా 1810 దరఖాస్తులు మాత్రమే పెండింగ్లో ఉన్నాయని అన్నారు.

News September 15, 2025

KNR: ప్రజావాణికి 387 దరఖాస్తులు

image

ప్రజావాణిలో భాగంగా కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. 387 అర్జీలు రాగా సత్వర పరిష్కారం కోసం వాటిని వివిధ శాఖల అధికారులకు బదిలీ చేశారు. పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీ కిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, డిఆర్ఓ వెంకటేశ్వర్లు, ఆర్డీవో రమేష్ బాబు పాల్గొన్నారు.

News September 15, 2025

కరీంనగర్ కలెక్టరేట్ భవనం భద్రమేనా?

image

KNR కలెక్టరేట్‌ను 1982లో కట్టారు. సరైన నిర్వహణ లేకపోవడంతో అక్కడక్కడ పెచ్చులు ఊడుతున్నాయి. ప్రధాన విభాగాలన్నీ పాత భవనంలోనే కొనసాగుతుండటం, నూతన కలెక్టరేట్ నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నా ముందుకు సాగకపోవడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. కార్యాలయాలను నూతన భవనంలోకి మార్చాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఇటీవల ఆదిలాబాద్ కలెక్టరేట్ కూలిన ఘటనతో కరీంనగర్ కలెక్టరేట్ భవనంలో భద్రతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.