News September 27, 2024
సైబరాబాద్ కమిషనరేట్‌లో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి

సైబరాబాద్ కమిషనరేట్ CPO కార్యాలయంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి పాల్గొని కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్, EOW DCP ప్రసాద్, అడ్మిన్ అడిషనల్ DCP రవిచంద్రన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Similar News
News December 3, 2025
కోకాపేటలో ఎకరం రూ.131 కోట్లు

కోకాపేట్ నియోపోలిస్ భూముల వేలం ముగిసింది. నగరానికి చెందిన యూలా గ్రూప్ నాలుగు ఎకరాల ప్లాటును వేలంలో సొంతం చేసుకుంది. ఎకరానికి రూ.131 కోట్లు వెచ్చించింది. నియోపోలిస్ నుంచి గండిపేట్ వ్యూ కనిపిస్తుండటంతో ఇక్కడి కమ్యూనిటీని డెవలప్ చేసే అవకాశం ఉంటుందని, అందుకే ఈ నాలుగు ఎకరాలను ఆన్లైన్ వేలంలో యూలా గ్రూప్ కొనుగోలు చేసినట్లు తెలిసింది.
News December 3, 2025
గ్లోబల్ సమ్మిట్‌కు చార్టెడ్ ఫ్లైట్లలో ప్రముఖులు

గ్లోబల్ సమ్మిట్‌కు అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. అతిథుల కోసం ఏకంగా 3 హెలిప్యాడ్లు సిద్ధం చేశారు. 50 అడుగుల వెడల్పుతో నిర్మించిన ఈ హెలిప్యాడ్ల ద్వారా సుమారు 500 మంది ప్రముఖ అతిథులను రిసీవ్ చేసుకునేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సీఈవోలు, సినీ తారలు సహా పలువురు ప్రముఖులు చార్టెడ్ ఫ్లైట్లలో ఇక్కడికి చేరుకుంటారని అధికారులు Way2Newsకు తెలిపారు.
News December 3, 2025
MCA విద్యార్థులకు గమనిక.. పరీక్షలు ఎప్పుడంటే!

ఉస్మానియా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ MCA 3వ సెమిస్టర్ పరీక్షల తేదీని వర్సిటీ అధికారులు ప్రకటించారు. ఈ నెల 4 నుంచి (గురువారం) పరీక్షలు ప్రారంభమవుతాయన్నారు. వీటితోపాటు బ్యాక్ లాగ పరీక్షలు కూడా నిర్వహిస్తామని వర్సిటీ పరీక్షల విభాగం అధిపతి ప్రొ.శశికాంత్ తెలిపారు.పరీక్షలకు సంబంధించి టైం టేబుల్ కోసం ఉస్మానియా వెబ్ సైట్ http://www.oucde.net/ చూడవచ్చు.


