News June 23, 2024

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

image

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో అర్ధరాత్రి సమయంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై కేసులు నమోదు చేశారు. దీనిలో భాగంగా 292 ద్విచక్ర వాహనాలు, 11 ఆటోలు, 80 కార్లు, రెండు హెవీ వెహికల్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అత్యధికంగా ఐటీ కారిడార్‌లో 182 మంది మద్యం తాగి వాహనాలను నడుపుతూ పట్టుబడ్డారన్నారు.

Similar News

News January 2, 2025

హైదరాబాద్ సీపీకి ఎమ్మెల్సీ కవిత ఫోన్ కాల్

image

హైదరాబాద్ సీపీకి ఎమ్మెల్సీ కవిత ఫోన్ చేశారు. నగరంలోని ఇందిరా పార్క్ వద్ద శుక్రవారం తలపెట్టిన బీసీ సభకు అనుమతి ఇవ్వాలని గురువారం ఫోన్ చేసి విజ్ఞప్తి చేశారు. సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా సభ తలపెట్టామని అన్నారు. కాగా, ఇప్పటికే సభ సన్నాహాలపై కవిత బీసీ సంఘాలతో విస్తృతంగా సమావేశాలు జరిపారు. మహాసభ పోస్టర్‌ సైతం ఆవిష్కరించారు. అంతకుముందు ఆమె.. సభ గురించి మీడియాతో మాట్లాడారు.

News January 2, 2025

ALERT.. HYD: మాంజాతో గొంతులు తెగుతున్నాయ్!

image

సంక్రాంతి వచ్చిందంటే చాలు.. ఆకాశంలో గాలిపటాలు ఎగురుతుంటాయ్. చిన్నా, పెద్దా తేడా లేకుండా ఎగరవేస్తుంటారు. అయితే HYDలో కొందరు కైట్స్ ఎగరవేయడానికి చైనా మాంజా వాడుతుండడంతో రోడ్లపై వెళ్లే వారికి అవి ప్రమాదకరంగా మారాయి. గతంలో చైనా మాంజాతో గొంతులు తెగి ప్రాణాలు పోయిన సందర్భాలూ ఉన్నాయి. తాజాగా ఆసిఫ్‌నగర్‌లో ఒకరు, రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌కు చెందిన దంపతులు బైకుపై వెళ్తుండగా మాంజాతో గాయాలపాలయ్యారు.

News January 2, 2025

HYD: సచివాలయంలో నేడు క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ

image

సంక్రాంతి తర్వాత రాష్ట్రంలో రైతు భరోసా పథకాన్ని ప్రారంభిస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇవాళ సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ఉదయం 11 గంటలకు క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం కానుంది. ఈ సబ్ కమిటీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఛైర్మన్‌గా వ్యవహరించనుండగా.. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు భేటి కానున్నారు.