News January 30, 2025

సైబర్ క్రైమ్ కేసుల్లో డబ్బులు రిఫండ్ అయ్యేలా చూడలి: ఎస్పీ

image

ఆన్‌లైన్ మోసాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని సంగారెడ్డి ఎస్పీ చెన్నూరి రూపేష్ తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో మంత్లీ క్రైమ్ రివ్యూ మీటింగ్లో ఆయన మాట్లాడారు. ఫైబర్ క్రైమ్ కేసులదలో బాధితులు కోల్పోయిన డబ్బు త్వరగా రిఫండ్ అయ్యే విధంగా చూడాలని సిబ్బందికి సూచించారు. సమీక్ష సమావేశంలో అదనపు ఎస్పీ సంజీవరావు, డీఎస్పీలు రవీందర్ రెడ్డి రామ్మోహన్ రెడ్డి వెంకట్ రెడ్డి ఉన్నారు.

Similar News

News December 3, 2025

124 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

image

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(C<>BSE<<>>) 124 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 22 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఇంటర్, డిగ్రీ, పీజీ, బీఈడీ/ఎంఈడీ, నెట్/SLAT, పీహెచ్‌డీ, ఎంబీఏ, సీఏ, ICWA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష(టైర్1, టైర్ 2), ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.cbse.gov.in

News December 3, 2025

చిత్తూరు: డిప్యూటీ MPDOలకు కీలక బాధ్యతలు

image

చిత్తూరు జిల్లాలో సచివాలయాలను పర్యవేక్షించేలా డిప్యూటీ ఎంపీడీవోలను నియమిస్తున్నారు. మండలంలోని 31 మండలాల్లో 504 గ్రామ సచివాలయాలు, 108 వార్డు సచివాలయాలు ఉన్నాయి. వీటిని పర్యవేక్షించేందుకు ఇప్పటికే 27మంది డిప్యూటీ ఎంపీడీవోలు విధుల్లో చేరారు. సచివాలయాల్లో మెరుగైన సేవలు అందించేలా వీరు పర్యవేక్షణ చేయనున్నారు.

News December 3, 2025

‘సంచార్ సాథీ’తో 7 లక్షల ఫోన్లు రికవరీ: PIB

image

<<18445876>>సంచార్ సాథీ<<>> గురించి వివాదం కొనసాగుతోన్న వేళ.. ఆ యాప్‌ గురించి PIB వివరించింది. ఈ ఏడాది జనవరి 17న ప్రారంభమైన ఈ యాప్‌నకు 1.4 కోట్లకుపైగా డౌన్‌లోడ్‌లు ఉన్నాయని పేర్కొంది. ఇప్పటివరకు 42 లక్షల దొంగిలించిన ఫోన్‌లను బ్లాక్ చేసి, 26 లక్షలకు పైగా మొబైల్‌లను ట్రేస్ చేసినట్లు వెల్లడించింది. వీటిలో 7.23 లక్షల ఫోన్లు తిరిగి ఓనర్ల వద్దకు చేరాయని, యూజర్ల ప్రైవసీకి పూర్తి ప్రాధాన్యం ఉంటుందని తెలిపింది.