News June 16, 2024
సైబర్ నేరగాళ్లు పంపిస్తున్న మెసేజ్ లకు స్పందించవద్దు: సీపీ
ఎస్బీఐ యూనో అప్లికేషన్స్ ఉపయోగిస్తున్న వారిని లక్ష్యంగా చేసుకొని సైబర్ నేరగాళ్లు పంపిస్తున్న లింకులు, మెసేజ్ లను స్పందించి మోస పోవద్దని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఏ బ్యాంక్ అయినా అప్ డేట్ కోసం వివరాలు అడగవని, మోసపూరిత మెసేజ్‌లలో వచ్చిన లింకుల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీస్ కమిషనర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
Similar News
News September 10, 2024
KMM: పోలీస్ జాగిలానికి ఏఎస్పీ ఘన నివాళి
అనారోగ్యంతో మరణించిన పోలీస్ జాగిలం షైనీకి ఘనంగా అంతిమ వీడ్కోలు పలికారు. జిల్లా పోలీస్ శాఖకు పోలీస్ జాగిలం షైనీ అందించిన సేవలు మరువలేనివని అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ పరితోష్ పంకజ్ అన్నారు. ఈ రోజు జిల్లా పోలీస్ డాగ్ స్క్వాడ్లో విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ జాగిలం అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందింది. గత నెల రోజులుగా బ్లడ్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఈ రోజు తుది శ్వాస విడిచింది.
News September 10, 2024
ఖమ్మం: జిల్లాలో 76 కి.మీ.మేర దెబ్బతిన్న రహదారులు
ఖమ్మం జిల్లాలో వరదల కారణంగా 76 కి.మీ.మేర రహదారులు దెబ్బతిన్నాయి. పలు చోట్ల కోతకు గురికాగా, మరికొన్ని చోట్ల పూర్తిగా తెగిపోయాయి. ఈ మొత్తం నష్టం విలువ రూ.180.37 కోట్లుగా ఉందని అధికారులు పేర్కొన్నారు. అలాగే జిల్లావ్యాప్తంగా నీటిపారుదల శాఖ పరిధిలో రూ.60 కోట్ల మేర నష్టం జరిగిందని నివేదికల్లో పొందుపర్చారు. 45 చెరువులకు పలు ప్రాంతాల్లో గండ్లు పడ్డాయి. మొత్తంగా 103 ప్రాంతాల్లో ఈ శాఖకు నష్టం వాటిల్లింది.
News September 10, 2024
KMM: అతిథి అధ్యాపక పోస్టులకు ఇంటర్వ్యూ
ఖమ్మం జిల్లాలో SR&BGNR కళాశాలలో ఖాళీగా ఉన్న అతిథి అధ్యాపకుల పోస్టులకు మంగళవారం సాయంత్రం 5:00 గంటలకు దరఖాస్తు ముగిసింది. ఇంటర్వ్యూకి తేదీలు ప్రకటించారు. 11న జరగనున్న ఇంగ్లిష్-1,హిస్టరీ-3,ఎకనామిక్స్-1 గణితం-3, బోటనీ-1,కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్-3,BCA-1,డేటా సైన్స్-1,బయో టెక్నాలజీ-1,12తేదీన జరగనున్న ఇంటర్వ్యూ కామర్స్-2, పొలిటికల్ సైన్స్-2,BBA-2 ఓ ప్రకటనలో ప్రిన్సిపల్ జాకీరుల్లా తెలిపారు.