News February 12, 2025
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. మంగళవారం కలెక్టర్ ఛాంబర్ నందు సురక్షితమైన ఇంటర్నెట్ దినోత్సవం సందర్భంగా పోస్టర్ను అదనపు కలెక్టర్ పి రాంబాబుతో కలిసి ఆవిష్కరించారు. సైబర్ నేరాలకు గురైతే 1930 టోల్ ఫ్రీ నెంబర్కు సమాచారం ఇవ్వాలన్నారు. క్యూఆర్ కోడ్ ద్వారా వ్యక్తిగత సమాచారం పంచుకోకూడదని.. తెలియని లింక్ కిక్ చెక్ చేయద్దన్నారు.
Similar News
News December 7, 2025
‘తీరు మార్చుకోకుంటే కఠిన చర్యలు’

అంబేడ్కర్ కోనసీమ జిల్లావ్యాప్తంగా ఆదివారం అన్ని పోలీస్ స్టేషన్లలో రౌడీషీటర్లకు ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు. జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూడటమే లక్ష్యంగా ఈ కార్యక్రమం జరిగింది. పాత నేర చరిత్రను పక్కనపెట్టి, సన్మార్గంలో నడవాలని పోలీసులు వారిని హెచ్చరించారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే పీడీ యాక్ట్ వంటి కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
News December 7, 2025
VKB: 2వ విడతలో 20 సర్పంచులు ఏకగ్రీవం

రెండో విడత సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా వికారాబాద్ డివిజన్లోని 20 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైనట్లు అధికారులు తెలిపారు. వికారాబాద్ నియోజకవర్గంలో 175 జీపీలకు 20 గ్రామ పంచాయతీలు, 1,520 వార్డులకు 294 ఏకగ్రీవమయ్యాయి. దారూర్ మండలంలో 34 జీపీలకు 5, మోమిన్పేట్లో 29 జీపీలకు 4, నవాబుపేటలో 32 జీపీలకు 2, బంట్వారంలో 12 జీపీలకు 1, మర్పల్లిలో 29 జీపీలకు 3, కోట్పల్లిలో 18 జీపీలకు 5 చోట్ల సర్పంచులు ఏకగ్రీవమయ్యారు.
News December 7, 2025
NDMAలో పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (<


