News February 12, 2025
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. మంగళవారం కలెక్టర్ ఛాంబర్ నందు సురక్షితమైన ఇంటర్నెట్ దినోత్సవం సందర్భంగా పోస్టర్‌ను అదనపు కలెక్టర్ పి రాంబాబుతో కలిసి ఆవిష్కరించారు. సైబర్ నేరాలకు గురైతే 1930 టోల్ ఫ్రీ నెంబర్‌కు సమాచారం ఇవ్వాలన్నారు. క్యూఆర్ కోడ్ ద్వారా వ్యక్తిగత సమాచారం పంచుకోకూడదని.. తెలియని లింక్ కిక్ చెక్ చేయద్దన్నారు.
Similar News
News March 21, 2025
గోదావరిఖని: ప్రాణం తీసిన బెట్టింగ్..

బెట్టింగ్ యాప్‌లో డబ్బులు పెట్టి మోసపోయి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఓ డయాగ్నస్టిక్ సెంటర్లో పనిచేస్తున్న కొరవీణ సాయితేజ బెట్టింగ్ యాప్‌లో డబ్బులు పెట్టి పోగొట్టుకున్నాడు. దీంతో మనస్తాపం చెంది రెండురోజుల క్రితం గడ్డిమందు తాగి ఆత్మహత్యకు యత్నించగా.. చికిత్స పొందుతూ శుక్రవారం మరణించాడు.
News March 21, 2025
సిరిసిల్ల: పదోతరగతి పరీక్షలకు 99.8శాతం విద్యార్థుల హాజరు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో శుక్రవారం జరిగిన పదోతరగతి పరీక్షలకు 99.8% విద్యార్థులు హాజరైనట్లు రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. జిల్లాలోని (35) పరీక్షా కేంద్రాల్లో (6766) మంది విద్యార్థులకు (99.8%) హాజరుశాతంతో (6752) మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. (14) మంది విద్యార్ధులు గైర్హాజరయ్యారని తెలిపారు. మొదటిరోజు పరీక్ష సజావుగా సాగిందని కలెక్టర్ తెలిపారు.
News March 21, 2025
IPLలోకి ఎంట్రీ ఇస్తోన్న కేన్ మామ

ఐపీఎల్ 2025లో న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ సరికొత్త అవతారం ఎత్తనున్నారు. ఓపెనింగ్ గేమ్ ఆర్సీబీ-కేకేఆర్ మ్యాచుకు ఆయన ఎక్స్‌పర్ట్‌గా వ్యవహరించనున్నారు. కాగా మెగా వేలంలో విలియమ్సన్ అన్‌సోల్డ్‌గా మిగిలారు. రూ.2 కోట్ల కనీస ధరతో ఆయనను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ముందుకు రాలేదు. మరోవైపు PSL డ్రాఫ్ట్‌లోనూ కేన్ మామను ఎవరూ పట్టించుకోలేదు.