News September 22, 2024
సైబర్ నేరాలపై ఎస్పీ రోహిత్ రాజు సమీక్ష
సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలను నిత్యం అప్రమత్తం చేస్తూ ఉండాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. ప్రభుత్వ నిషేధిత గంజాయి రవాణాను అరికట్టడంలో బాధ్యతగా వ్యవహరిస్తున్న పోలీస్ అధికారుల తీరు ప్రశంసనీయమని చెప్పారు. శనివారం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో జరిగిన నెలవారి సమీక్ష సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
Similar News
News October 7, 2024
‘డీఎస్సీ 2008 ఏజెన్సీ అభ్యర్థుల జాబితా సవరించాలి’
ఉమ్మడి ఖమ్మం జిల్లా డీఎస్సీ 2008 అర్హుల జాబితాలో తప్పులు చోటుచేసుకున్నాయని, వాటిని సవరించి కొత్త జాబితా విడుదల చేయాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుం దెబ్బ) రాష్ట్ర నాయకులు కల్తి రాంప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం కారేపల్లిలో జరిగిన డీఎస్సీ 2008 బాధితుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏజెన్సీ ఏరియా గిరిజన అభ్యర్థుల లిస్టుల తయారీలో జరిగిన తప్పిదాన్ని అధికారులు గుర్తించాలన్నారు.
News October 6, 2024
రఘునాథపాలెం: బతుకమ్మ పూల కోసం వెళ్లి కరెంట్ షాక్‌తో మృతి
రఘునాథపాలెం మండలం పాపడపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామంలో ఆదివారం మిట్టపల్లి చరణ్ తేజ్ బతుకమ్మ కోసం డాబాపైన పూలు కోస్తుండగా.. ప్రమాదవశాత్తు కరెంట్ తీగలు తాకి షాక్‌కు గురై మృతి చెందాడు. పలుమార్లు విద్యుత్ అధికారులకు వైర్లు కిందకు ఉన్నాయని చెప్పిన పట్టించుకొలేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
News October 6, 2024
ఖమ్మం: వెదురు కోసం వెళ్లి గుండెపోటుతో మృతి
గుండెపోటులో వ్యక్తి చనిపోయిన ఘటన తల్లాడ మండలం జగన్నాథపురంలో జరిగింది. స్థానికుల వివరాలిలా.. గ్రామానికి చెందిన మల్లికార్జునరావు (50) శనివారం ఉదయం వెదురు బొంగుల కోసం అడవికి వెళ్లాడు. గుండెనొప్పి వస్తోందని మధ్యాహ్నం తనతో ఉన్నవారికి చెప్పాడు. వారు మల్లికార్జునరావును ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.