News November 13, 2024
సైబర్ నేరాలపై తస్మాత్ జాగ్రత్త : ఎస్పీ నరసింహ
ప్రస్తుత తరుణంలో సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ సూచించారు. వ్యక్తిగత సమాచారం, బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీలు వంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి షేర్ చేయడం గాని, సైబర్ నేరగాళ్ల నుంచి వచ్చే కాల్స్, మెసేజ్‌లకు ఎట్టి పరిస్థితులలోను స్పందించవద్దన్నారు. అపరిచిత వ్యక్తులను నమ్మి ఆన్లైన్లో డబ్బులు పంపించడం చేయరాదని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.
Similar News
News November 15, 2024
తూ.గో: నటుడు పోసానిపై పలుచోట్ల ఫిర్యాదులు
టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోసాని కృష్ణమురళిపై చర్యలు తీసుకోవాలని తుని, అనపర్తి, ముమ్మిడివరం మండలాల్లో గురువారం ముగ్గురు ఫిర్యాదులు చేశారు. తునిలో వెంకటేశ్వరస్వామి భక్తుడు శివాజీ, అనపర్తిలో TV5 ప్రతినిధి మణికంఠ, జర్నలిస్ట్ రమేశ్ స్థానిక పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. నటుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరామన్నారు.
News November 15, 2024
తూ.గో: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి..మరొకరికి గాయాలు
రాజానగరం మండలం తూర్పుగోనగూడెంలోని హైవేపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. స్థానిక SI మనోహర్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు నేవీ డిపర్ట్‌మెంట్‌కు చెందిన ముగ్గురు మినీ లారీలో వైజాగ్ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందన్నారు. ఈ ఘటనలో త్రిపాఠి, షైబాజ్ మరణించగా..నగేశ్‌కి తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించామన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
News November 15, 2024
అమలాపురం: ఫైనాన్స్ బిడ్‌లను ఓపెన్ చేసిన జేసీ
కోనసీమ జిల్లాలో ఇసుక త్రవ్వకాలు, వాహనాలలో లోడింగ్ స్టాక్ యార్డులకు తరలింపు, తిరిగి వాహనాల్లో లోడింగ్ ఛార్జీల వసూళ్లు నిమిత్తం పిలిచిన ఫైనాన్స్ బిడ్లను గురువారం రాత్రి జాయింట్ కలెక్టర్ నిషాంతి, జిల్లాస్థాయి ఇసుక కమిటీ సభ్యుల సమక్షంలో అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద ఓపెన్ చేశారు. ఈ ఫైనాన్స్ బిడ్‌లలో తక్కువ రేటు కోడ్ చేసిన ఏజెన్సీలకు ఇసుక రీచుల ఆపరేషన్ నిర్వహణను అప్పగించడం జరుగుతుందని ఆమె తెలిపారు.