News July 26, 2024

సైబర్ నేరాలపై ‘ప్రకాశం పోలీస్’ విస్తృత అవగాహన

image

సైబర్ నేరాల పట్ల ప్రజలు అవగాహన పెంపొందించుకోవాలని జిల్లా పోలీస్ శాఖ ప్రజలను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తోంది. మెసేజింగ్ యాప్‌ల ద్వారా పంపిన APK ఫైల్స్‌ను ఇన్ స్టాల్ చేయడం, అపరిచిత వ్యక్తులతో ఫోన్లో మాట్లాడడం, ఓటీపీ పంచుకోవడం వంటివి చేయవద్దని గురువారం ఒక ఆసక్తికర పోస్టర్‌ను విడుదల చేసింది. చెడు వినకు, చూడకు, మాట్లాడకు అనేలా విడుదల చేసిన ఈ పోస్టర్ ప్రజలను ఆలోచింపచేస్తోంది.

Similar News

News November 21, 2025

ప్రకాశం: స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించాలి

image

స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడానికి ధర్తీమాతా బచావో అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ రాజాబాబు తెలిపారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో ధర్తీ మాత బచావో అభియాన్ కార్యక్రమంపై సంబంధిత అధికారులతో శుక్రవారం కలెక్టర్ సమావేశమయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులు తమ పొలాల నేల పరిస్థితులను మెరుగుపరచడానికి అవసరమైన ఎరువులను వినియోగించేలా అధికారులు సూచించాలన్నారు.

News November 21, 2025

ఇద్దరు హోంగార్డుల మధ్య గొడవ.. సీరియస్ యాక్షన్ తీసుకున్న ప్రకాశం ఎస్పీ!

image

క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడ్డ ఇద్దరు హోంగార్డులను విధుల నుంచి తాత్కాలికంగా తప్పిస్తూ ఎస్పీ హర్షవర్ధన్ రాజు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పెద్దారవీడుకు చెందిన హోంగార్డ్ యాసిన్, దోర్నాలకు చెందిన ప్రశాంత్ కుమార్, వెలిగండ్లకు చెందిన బాలసుబ్రమణ్యం విధుల నిమిత్తం 19న ఒంగోలుకు వచ్చి విశ్రాంతి కోసం గదిని తీసుకున్నారు. ప్రశాంత్, సుబ్రహ్మణ్యం గొడవ పడగా, ఇద్దరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు.