News July 19, 2024

సైబర్ నేరాలు పట్ల ప్రజలు జాగ్రత్త వహించాలి: NGKL SP

image

సైబర్ నేరాల మోసాల బారిన పడకుండా ప్రజలు జాగ్రత్త వహించాలని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ పేర్కొన్నారు. సైబర్ నేరాలు, ఆన్ లైన్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రైతుల రుణమాఫీ పేరుతో వచ్చే ఫేక్ లింకులను, అపరిచిత కాల్స్, మెసేజ్ పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యక్తిగత వివరాలు, ఓటీపీ చెప్పవద్దన్నారు. సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930 కాల్ చేసి ఫిర్యాదు చేయలని తెలిపారు.

Similar News

News December 12, 2024

రాజీమార్గమే రాజ మార్గం: MBNR ఎస్పీ

image

రాజీమార్గమే రాజ మార్గం అని MBNR ఎస్పీ జానకి అన్నారు. ఈనెల 14న జరిగే జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాజీ పడేటట్లు కక్షిదారులకు కౌన్సెలింగ్ ఇవ్వాలని అధికాలకు సూచించారు. ఇద్దరు కొట్లాడితే ఒక్కరే గెలుస్తారు.. కానీ రాజీ పడితే ఇద్దరూ గెలుస్తారని.. కక్షలతో ఏం సాధించలేమన్నారు. లోక్ అదాలత్ ద్వారా బాధితులకు సత్వరమే న్యాయం జరుగుతుందని జిల్లా ఎస్పీ తెలిపారు.

News December 12, 2024

మహబూబ్‌నగర్: వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి

image

ఉమ్మడి MBNR జిల్లాలో వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందారు. వివరాలిలా.. జడ్చర్ల మండలం లింగంపేట మాజీ సర్పంచ్ కృష్ణయ్యగౌడ్(45) మృతిచెందగా.. ఆగి ఉన్న లారీ ఢీకొని రాంప్రకాశ్, లవకుశ్ మృతి చెందారు. కర్నూల్ జిల్లాకి చెందిన గొడ్డయ్యగౌడ్ పాల పాకెట్ల కోసం వెళ్లి రోడ్డు దాటుతుండగా బస్సు ఢీకొనండంతో చనిపోయాడు. నవాబుపేట మండలం పోమాల్‌కి చెందిన రాజు నడుస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మృతిచెందాడు

News December 12, 2024

నాగర్‌కర్నూల్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి

image

నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలం రేవల్లి వద్ద జరిగిన రోడ్డు <<14853514>>ప్రమాదంలో <<>>ఇద్దరు యువకులు మృతి చెందిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాల ప్రకారం.. UP బల్‌రాంపూర్‌ జిల్లాకి చెందిన రాంప్రకాశ్(35), లవకుశ్(33) కల్వకుర్తి నుంచి మిడ్జిల్ వైపు బైక్‌పై వెళ్తున్నారు. ఈ క్రమంలో రోడ్డు మీద ఆగి ఉన్న లారీని ఢీకొట్టారు. కాగా, ఈ ఘటనలో ఇద్దరు యువకులు స్పాట్‌లోనే చనిపోయారు. కేసు నమోదైంది.