News March 18, 2025

సైబర్‌ నేరాల దర్యాప్తులో సాంకేతిక నైపుణ్యమే కీలకం: ఎస్పీ

image

సైబర్‌ నేరాల దర్యాప్తులో సాంకేతిక నైపుణ్యమే కీలకమని జిల్లా ఎస్పీ జగదీశ్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక పోలీసు కాన్ఫరెన్స్ హాలులో జిల్లాలోని పోలీసు అధికారులకు సైబర్, ఇతర నేరాలలో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్‌పై వర్క్ షాప్ నిర్వహించారు. హైదరాబాద్ నుండీ వచ్చిన సైబర్ ఎక్స్పర్ట్ రామాంజినేయులచే సైబర్ నేరాల శోధనలో పాటించాల్సిన మెళకువలపై అవగాహన కల్పించారు. కేసు ఛేదనలో ప్రతీ అంశాన్ని కీలకంగా తీసుకోవాలన్నారు.

Similar News

News November 17, 2025

అనంతపురం: పోలీసుల PGRSకు 83 పిటిషన్లు.!

image

అనంతపురం జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం అర్బన్ DSP శ్రీనివాసరావు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించారు. జిల్లా SP ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి 83 పిటీషన్లు వచ్చాయి. పిటిషనర్లతో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు.

కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన నార్పల యువతి

image

5,895 మీటర్లు ఎత్తైన కిలిమంజారో పర్వతాన్ని నార్పల మండలం దుగుమర్రికి చెందిన యువతి కె. కుసుమ అధిరోహించారు. దీంతో శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ కుసుమను ఆదివారం అభినందించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఫ్రీ స్టాండింగ్ పర్వతం, ఆఫ్రికా ఖండంలోనే అత్యంత ఎత్తైన కిలిమంజారో శిఖరంపై కుసుమ (19) ఈ నెల 12న భారత జెండా ఆవిష్కరించడం గర్వకారణమన్నారు.