News December 3, 2024
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కర్నూలు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎస్పీ మాట్లాడుతూ.. ఏదో ఒక లింక్ పంపించి, ఆశ చూపడంతో అమాయక యువత వారి ఉచ్చులో పడి నిలువునా దోపిడీకి గురవుతున్నారన్నారు. ఉచితాలకు మోసపోయి సైబర్ నేరగాళ్ల వలలో పడవద్దు అన్నారు. ఎవరైనా సైబర్ నేరాల బారిన పడితే ఘటన జరిగిన వెంటనే బాధితులు 1930 నంబర్‌కు సమాచారం అందించాలన్నారు.
Similar News
News February 8, 2026
కర్నూలులో రెసోనెన్స్.. సీమకు జాతీయ స్థాయి విద్య

రెసోనెన్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కర్నూలులో ఫిబ్రవరి 7(శనివారం) ప్రారంభమైంది. కార్యక్రమానికి టీ.జీ. వెంకటేశ్, పద్మశ్రీ బ్రహ్మానందం, ఎంపీ బస్తిపాటి నాగరాజు హాజరై రెసోనెన్స్ 25 ఏళ్ల అకడమిక్ సేవలను ప్రశంసించారు. రాయలసీమ విద్యార్థులకు స్థానికంగా నాణ్యమైన విద్య, నిపుణుల మార్గదర్శకత్వం, క్రమశిక్షణతో కూడిన చదువు వాతావరణం లభిస్తే JEE/NEET వంటి పోటీపరీక్షల్లో గొప్ప విజయాలు సాధిస్తారని వారు తెలిపారు.
News February 8, 2026
వ్యర్థాల నిర్వహణ సమర్థవంతంగా నిర్వహించాలి: కలెక్టర్

కలెక్టరేట్‌లో వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్ అంశాలపై మున్సిపల్ కమిషనర్లతో కలెక్టర్ సమీక్షించారు. ఆమె మాట్లాడుతూ.. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిర్దేశాల ప్రకారం వ్యర్థాల నిర్వహణను సమర్థవంతంగా నిర్వహించాన్నారు. పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలన్నారు. తడి చెత్తను సాంకేతిక పద్ధతి ద్వారా వ్యవసాయ ఎరువుగా మార్చాలన్నారు. డంపింగ్ యార్డులలో పేరుకుపోయి ఉన్న వ్యర్థాలను శుభ్రం చేయించాలన్నారు.
News February 7, 2026
రోడ్డు ప్రమాదాల నియంత్రణే లక్ష్యం: ఎస్పీ

రహదారి ప్రమాదాల నియంత్రణ లక్ష్యంగా ప్రతీ శనివారం రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్ల పరిధిలో ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించారు. మైనర్లు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. హెల్మెట్ ధరించడం తప్పనిసరి, ఓవర్ స్పీడ్, ఓవర్ లోడ్, డ్రంకెన్ డ్రైవ్ చేయరాదని తెలిపారు.


