News February 7, 2025
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: అనకాపల్లి ఎస్పీ
సైబర్ నేరాల పట్ల పోలీసులు అప్రమత్తంగా ఉండాలని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా హెచ్చరించారు. గురువారం ఎస్.రాయవరం పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. శాంతి భద్రతల సమస్యపై ఆరా తీశారు. గంజాయి అక్రమ రవాణా జరక్కుండా చూడాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కు పాదం మోపాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
Similar News
News February 7, 2025
మరోసారి SVSC తరహా మూవీ తీయనున్న అడ్డాల?
‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’తో మంచి విజయాన్ని దక్కించుకున్న దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల, ఆ తర్వాత మళ్లీ అలాంటి విజయాన్ని అందుకోలేకపోయారు. ముకుంద, నారప్ప ఫర్వాలేదనిపించగా బ్రహ్మోత్సవం, పెదకాపు నిరాశపరిచాయి. దీంతో ఆయన మరోసారి SVSC తరహా కుటుంబ కథను నమ్ముకున్నట్లు తెలుస్తోంది. అక్కాచెల్లెళ్ల మధ్య సాగే భావోద్వేగాలే ఇతివృత్తంగా ‘కూచిపూడి వారి వీధి’ అన్న మూవీని తెరకెక్కిస్తున్నారని సమాచారం.
News February 7, 2025
కొణిజర్ల: కాల్వలో ట్రాక్టర్ బోల్తా.. రైతు మృతి
ప్రమాదవశాత్తు సాగర్ కాల్వలో ట్రాక్టర్ బోల్తా పడి రైతు మృతి చెందిన ఘటన గురువారం కొణిజర్ల మండలంలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం..పెద్దగోపతికి చెందిన తడికమళ్ల రవి తన మిత్రులతో కలిసి మొక్కజొన్న పంటకు నీరు కట్టేందుకు ట్రాక్టర్పై జనరేటర్ తీసుకుని బయలుదేరాడు. రాపల్లె మేజర్ కాల్వ మీదుగా వెళ్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కాల్వలో పడింది. రవిపై ఇంజిన్ తిరగబడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
News February 7, 2025
HYD: దారుణం.. మహిళపై కానిస్టేబుల్ అత్యాచారం
మహిళపై కానిస్టేబుల్ అత్యాచారం చేశాడు. మేడ్చల్ పోలీసుల వివరాలు.. ఓ కేసు కోసం PSకు వచ్చిన మహిళ(31)తో PC సుధాకర్ పరిచయం పెంచుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని ఇంటికి పిలిచి పలుమార్లు అత్యాచారం చేశాడు. గర్భం దాల్చడంతో అబార్షన్ చేసుకోవాలని ఒత్తిడి చేశాడు. చివరకు అతడి భార్య, స్నేహితుడితో కలిసి దాడి చేయించడంతో బాధితురాలు PSలో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. నిందితుడిని అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు.