News April 3, 2024
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహజన్ అన్నారు. సైబర్ నేరాల కట్టడికి జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో ప్రత్యేక శిక్షణ పొంది సైబర్ వారియర్స్‌గా నియమితులైన సిబ్బందికి బుధవారం ఆయన ఫోన్లు, సిమ్ కార్డులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిరిసిల్ల జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్‌కు ఒక సైబర్ వారియర్‌ను నియమించినట్టు ఆయన పేర్కొన్నారు.
Similar News
News February 9, 2026
KNR: మున్సిపల్ ఎన్నికలు.. 163 సెక్షన్ అమలు

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సెక్షన్ 163 విధించినట్లు కమిషనర్ గౌస్ ఆలం తెలిపారు. రేపు ఉదయం 10 నుంచి ఫిబ్రవరి సాయంత్రం 6 గంటల వరకు కమిషనరేట్ పరిధిలో కరీంనగర్, చొప్పదండి, హుజూరాబాద్, జమ్మికుంట ప్రాంతాల్లో ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని, శాంతియుతంగా పోలింగ్ జరిగేందుకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News February 9, 2026
KNR: ఎన్నికల నిఘా ‘ముమ్మరం’.. సరిహద్దుల్లో తనిఖీలు!

ప్రలోభాలను అరికట్టేందుకు ఎన్నికల అధికారులు, పోలీసులు నిఘాను ముమ్మరం చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రతి మున్సిపాలిటీ పరిధిలో ఫ్లయింగ్ స్క్వాడ్లు నిరంతరం గస్తీ కాస్తున్నాయి. జిల్లా సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి, వాహనాల తనిఖీని కఠినతరం చేశారు. ఇప్పటికే ఫిబ్రవరి 28 వరకు జిల్లాలోపోలీసు యాక్ట్ అమలులో ఉంటుందని సీపీ తెలిపారు.
News February 8, 2026
KNR: మున్సిపల్ ఎన్నికలకు పటిష్ఠ బందోబస్తు: సీపీ

కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ఠ చర్యలు చేపట్టామని సీపీ గౌష్ ఆలం తెలిపారు. ఎన్నికల కోడ్ అమలు కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, సమస్యాత్మక కేంద్రాలపై వెబ్ కాస్టింగ్ ద్వారా నిఘా ఉంచుతామని పేర్కొన్నారు. అల్లరి మూకలను ఇప్పటికే బైండ్ ఓవర్ చేశామని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు భయం లేకుండా ఓటు వేయాలని సూచించారు.


