News March 13, 2025
సైబర్ మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్: విశాఖ సీపీ

విదేశాలలో చైనాకు సంబంధించిన ఫేక్ కంపెనీలలో పని చేస్తూ సోషల్ మీడియా ద్వారా ఎంతోమందిని మోసం చేసి డబ్బులు దోచుకున్న వ్యక్తి విశాఖ పోలీసులకు చిక్కాడు. అనకాపల్లికి చెందిన నిందితుడు చొప్పా ఉమా మహేశ్‌ను సైబర్ పోలీసులు బుధవారం ఎయిర్‌పోర్టులో అరెస్ట్ చేశారు. విదేశాల నుంచి అనకాపల్లి వచ్చి తిరిగి వెళ్తుండగా చాకచక్యంగా పట్టుకుని రిమాండ్‌కు తరలించారు. దీని వెనుక ఉన్న ముఠాను పట్టుకుంటామని విశాఖ సీపీ చెప్పారు.
Similar News
News April 10, 2026
IPL: రాత్రి 8.15 గంటలకు మ్యాచ్ ప్రారంభం

IPL అభిమానులకు గుడ్‌న్యూస్. RCB-RR మ్యాచ్ జరగాల్సిన గువాహటి స్టేడియం వద్ద వర్షం తగ్గింది. సిబ్బంది కవర్లు తొలగించారు. ఆటగాళ్లు ప్రాక్టీస్ మొదలుపెట్టారు. అంపైర్లు రా.8 గంటలకు టాస్ వేయనున్నారు. రా.8.15 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. పూర్తి ఓవర్ల గేమ్ జరగనుంది.
News April 10, 2026
కీర్తన హత్య ప్రభుత్వ వైఫల్యమే: YCP ట్వీట్

కడప జిల్లా కాజీపేటకు చెందిన కీర్తన శుక్రవారం <<19614640>>హత్య<<>>కు గురి కావడంపై YS జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని YCP ‘X’ ఖాతాలో ట్వీట్ చేసింది. ప్రభుత్వ వైఫల్యం వల్లే కీర్తన హత్య జరిగిందని, మహిళలపై ఇలాంటి దాడులను ఎట్టి పరిస్థితుల్లో సహించలేమన్నారు. రాష్ట్రంలో మహిళలపై దాడులు, హత్యలు పెరిగిపోతున్నా ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోవడం లేదన్నారు. నేరస్థులకు భయంలేకుండా పోయిందని ట్వీట్‌లో పేర్కొన్నారు.
News April 10, 2026
సిరిసిల్ల: నిబంధనలకు అనుగుణంగా అర్జీలు పరిష్కరించాలి

నిబంధనలకు అనుగుణంగా అర్జీలు పరిష్కరించాలని సిరిసిల్ల కలెక్టర్ గరిమ అగ్రవాల్ అన్నారు. సిరిసిల్లలోని కలెక్టరేట్‌లో భూభారతి రెవిన్యూ నీటిపారుదల సర్వే అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భూభారతి సాదా బైనమా కింద వచ్చిన అర్జీలను ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిష్కరించాలన్నారు. జిల్లాలోని చెరువులు, రిజర్వాయర్లు ప్రాజెక్టులు వెట్ లాండ్స్ కిందికి వస్తాయన్నారు.


