News March 5, 2025

సైబర్‌ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: MP 

image

రోజురోజుకూ పెరుగుతున్న సైబర్‌ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చిత్తూరు MP ప్రసాద్ రావు సూచించారు. డిజిటల్‌ అరెస్టు, కేవైసీ, ఓటీపీ, లాటరీ స్కామ్‌, క్రెడిట్‌ అండ్‌ డెబిట్‌ కార్డ్‌ స్కామ్‌, ఫేక్‌ యాప్స్‌, లోన్‌ స్కామ్స్‌, వర్క్‌ ఫ్రం హోమ్‌, యూపీఐ స్కామ్స్‌ వంటి సైబర్‌ మోసాల్లో ప్రజలు చిక్కుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వీటి పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించారు.

Similar News

News March 26, 2025

చిత్తూరు: స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వం సిద్ధం

image

చిత్తూరు జిల్లా పరిధిలో గురువారం నిర్వహించే మండల ప్రజాపరిషత్ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తయినట్లు జడ్పీ సీఈఓ రవికుమార్ తెలిపారు. అయన మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాలో ఖాళీ అయిన స్థానాలకు  మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కోఆప్షన్ సభ్యుల ఎంపికకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

News March 26, 2025

చిత్తూరు మాజీ ఎమ్మెల్యే ఇంట్లో చోరీ.. నిందితుడికి జైలు శిక్ష

image

మాజీ ఎమ్మెల్యే ఇంట్లో చోరీకి పాల్పడ్డ నిందితునికి కోర్టు జైలు శిక్ష విధించినట్లు పోలీసు అధికారులు బుధవారం తెలిపారు. పట్టణంలోని కట్టమంచికి చెందిన మహేశ్ మాజీ ఎమ్మెల్యే సీకే బాబు ఇంట్లో పని చేసేవాడు. 2023లో రూ.లక్ష దొంగతనం చేసి పరారయ్యాడు. అప్పట్లో సాంకేతిక ఆధారాలతో మహేశ్‌ను నిందితుడిగా గుర్తించి రిమాండ్‌కు తరలించారు. ఆరోపణలు రుజువు కావడంతో నిందితుడికి మూడు నెలల జైలు శిక్ష విధించారు.

News March 26, 2025

రామకుప్పం: బయట వ్యక్తులకు ప్రవేశం లేదు

image

రామకుప్పంలో ఎంపీడీవో కార్యాలయంలో గురువారం ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నిక నేపథ్యంలో బయట వ్యక్తులు ఎవరు గ్రామంలోకి రాకుండా ప్రవేశం నిషేధించినట్లు డీఎస్‌పీ పార్థసారథి ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామ సంబంధిత వ్యక్తులకు, ఎంపీటీసీ సభ్యులకు మాత్రమే ప్రవేశం ఉంటుందని స్పష్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రజలు సహకరించాలన్నారు. అతిక్రమించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

error: Content is protected !!