News April 8, 2025

సొంతింటి కలను నెరవేర్చిన సీఎం

image

ఓ పేద కుటుంబానికి సీఎం చంద్రబాబు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. తిరుచానూరు పర్యనకు జనవరి 12న వచ్చిన సీఎంను లీలావతి, శరవణ దంపతులు కలిశారు. తమకు ఇంటితో పాటు, ఆర్థిక సహాయం చేయాలని సీఎంను వేడుకున్నారు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని తిరుపతి కలెక్టర్‌ను చంద్రబాబు ఆదేశించారు. ఈ మేరకు కలెక్టర్ వెంకటేశ్వర్ లీలావతి దంపతులకు రూ.లక్ష చెక్కుతో, ఇంటిని మంజూరు చేశారు.

Similar News

News April 19, 2025

సిద్దిపేట: కరెంట్ షాక్‌తో బాలుడి మృతి

image

కరెంట్ షాక్ తగిలి <<16142215>>విద్యార్ధి మృతి<<>> చెందిన ఘటన తోగుట(M)లో జరిగిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాలు.. తుక్కాపూర్‌‌కు చెందిన చికుడ్క స్వామి గురువారం రాత్రి తన ఇద్దరి కుమారులతో కలిసి ఆలయం వద్దకు వెళ్లారు. గ్రామంలో పోచమ్మ బోనాల పండుగ నిర్వహించేందుకు విద్యుత్ డెకరేషన్ ఏర్పాటు చేశారు. ఆ వైరు ఇనుప పైపునకు తగిలిఉంది. ప్రణీత్ ఆడుకుంటూ ఇనుప పైపునకు తగలడంతో కరెంట్ షాక్ కొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు.

News April 19, 2025

రేపే బీసీ గురుకుల ఎంట్రన్స్ పరీక్ష

image

TG: బీసీ గురుకుల స్కూళ్లలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఖాళీగా ఉన్న 6, 7, 8, 9వ తరగతి సీట్లను భర్తీ చేసేందుకు రేపు అర్హత పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు జరుగుతుందని అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 109 పరీక్ష కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వివరించారు. మొత్తం 6,832 బ్యాక్‌లాగ్ సీట్లకు 26,884 అప్లికేషన్లు వచ్చాయని తెలిపారు.

News April 19, 2025

టెక్కలి జిల్లా ఆసుపత్రి సేవలపై పబ్లిక్ కామెంట్స్

image

➤ <<16135497>>టెక్కలి జిల్లా ఆసుపత్రికి<<>> వచ్చే కేసులను ఎక్కువగా శ్రీకాకుళం రిఫర్ చేయడం➤ఇక్కడ పనిచేస్తున్న కొందరు వైద్యులు ప్రైవేట్ క్లినిక్స్ కు అధిక ప్రాధాన్యత ఇవ్వడం.➤ఆసుపత్రిలో అందరికీ ఫ్యాన్లు,తాగునీరు లేకపోవడం,బెడ్ షీట్లు వేయకపోవడం ➤అత్యవసర ప్రసూతి కేసులపై పర్యవేక్షణ లోపం.➤వేధిస్తున్న అధునాతన వైద్య పరికరాల కొరత ➤ఆసుపత్రిలో రోగులపై కొందరు నర్సులు,సిబ్బంది దురుసు ప్రవర్తన.➤కొన్ని ముఖ్యమైన మందులు కొరత.

error: Content is protected !!