News August 31, 2024
సొంత ఖర్చులతో బోరు వేయించిన మంత్రి కోమటిరెడ్డి

నల్లగొండ మండలం మేళ్లదుప్పలపల్లిలో మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి తన సొంత ఖర్చులతో ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం బోర్ వేయించారు. ప్రజలు నీటి సమస్యపై మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీంతో మంత్రి వెంటనే తన సొంత ఖర్చులతో బోరు వేయిస్తానని ఇచ్చిన హామీ మేరకు ఈరోజు బోర్ వేయించారు.
Similar News
News November 16, 2025
లోక్ అదాలత్లో 6,362 కేసుల పరిష్కారం: ఎస్పీ

జాతీయ మెగా లోక్ అదాలత్ ద్వారా జిల్లాలో రికార్డు స్థాయిలో పెండింగ్ కేసులను పరిష్కరించినట్లు నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. రాష్ట్ర న్యాయ సేవా షెడ్యూల్ ప్రకారం నిర్వహించిన ఈ లోక్ అదాలత్లో మొత్తం 6,362 కేసులను రాజీ మార్గంలో పరిష్కరించామని ఆయన వెల్లడించారు. రాజీ మార్గమే రాజమార్గమని ఎస్పీ పేర్కొన్నారు.
News November 16, 2025
మిర్యాలగూడకు మంత్రులు..ఏర్పాట్లపై కలెక్టర్ ఆరా

మిర్యాలగూడలో సోమవారం జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కోసం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెంకట్ రెడ్డి విచ్చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ ఇలా త్రిపాఠి, సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి నేడు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. శెట్టిపాలెం నుంచి అవంతిపురం వరకు నిర్మించనున్న ఔటర్ రింగ్ రోడ్డుకు శంకుస్థాపన వంటి కార్యక్రమాల్లో మంత్రులు పాల్గొంటారు.
News November 16, 2025
NLG: బస్టాపుల వద్ద బస్సులు ఆపరా?

నల్గొండ జిల్లాలో బస్టాపుల వద్ద, రిక్వెస్ట్ స్టాప్ల వద్ద బస్సులు ఆపకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఆపాల్సిన స్టేజీల్లో బస్సు ఆపకుండా కొందరు కండక్టర్లు, డ్రైవర్లు ముప్పుతిప్పలు పెడుతున్నారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నించే ప్రయాణికులతో సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఆర్టీసీ ఉన్నతాధికారులు దృష్టి సారించి, సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.


