News June 30, 2024

సోంపేట:పాకిస్థానీ ఉగ్రవాదులను మట్టుబెట్టిన వీర జవాన్

image

సోంపేట మండలం మామిడిపల్లి పంచాయతీ చిన్న మామిడిపల్లి గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ బొడ్డు దొరబాబు వీరత్వం ప్రదర్శించారు. JK బరాముల్లా జిల్లా, ఆదిపురా గ్రామంలో నిర్వహించిన 32 రాష్ట్రీయరైఫిల్ ఆపరేషన్‌లో పాల్గొని, డ్రోన్ సహాయంతో ఇద్దరు పాకిస్థాన్ ఉగ్రవాదులను అంతమొందించారు. ఇంతటి సాహసం చూపిన దొరబాబు ఆర్మీ ఉన్నతాధికారుల నుంచి మెడల్ అందుకున్నారు.

Similar News

News October 14, 2024

SKLM: నేడు మద్యం దుకాణాలు లాటరీ

image

శ్రీకాకుళం జిల్లాలో మద్యం దుకాణాలను సోమవారం లాటరీ పద్ధతిలో దరఖాస్తుదార్లకు కేటాయించనున్నారు. నగరంలోని అంబేడ్కర్ ఆడిటోరియంలో ఉదయం 8 గంటల నుంచి ప్రక్రియ మొదలు కానుంది. జిల్లావ్యాప్తంగా 158 దుకాణాలకు గాను, 4670 దరఖాస్తులు వచ్చాయి. మద్యాన్ని ప్రయివేట్‌కు అప్పగిస్తూ ప్రభుత్వం వెలువరించిన విధివిధానాలకు లోబడి ఈప్రక్రియ జరగనుంది. స్టేషన్ల వారీగా ఆడిటోరియంలోకి పిలిచి లాటరీ తీస్తారు.

News October 13, 2024

ముగిసిన సెలవులు.. రేపటి నుంచే స్కూల్స్, కాలేజీలు

image

శ్రీకాకుళం జిల్లాలో రేపటి నుంచి పాఠశాలు, ఇంటర్ కాలేజీలు తెరుచుకొనున్నాయి. ఈ సందర్భంగా ప్రభుత్వం ఈనెల 3వ తేదీ నుంచి దసరా సెలవులు ఇవ్వగా నేటితో ముగిశాయి. అలాగే మరో పక్క జిల్లాలో ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ అనుబంధ డిగ్రీ కళాశాలలకు ఈనెల 7వ తేదీ నుంచి సెలవులు ప్రకటించగా నేటితో ముగియనున్నాయి. దీనితో జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి పాఠశాలలు, కళాశాలలు యథావిధిగా పునఃప్రారంభం కానున్నాయి.

News October 13, 2024

లావేరు: రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

image

లావేరు మండలం కేశవరాయనిపాలెం పంచాయతీ హనుమయ్యపేట గ్రామానికి చెందిన నాయిని చంటి (26) రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందాడు. నిన్న మురపాకు టిఫిన్‌కు బైక్‌పై వెళ్తుండగా ఎదురుగా వచ్చిన బైక్‌ ఢీకొంది. భర్త మృతి చెందడంతో భార్య భవాని ఆదివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ప్రస్తుతం భవాని మూడు నెలల గర్భవతి. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను శ్రీకాకుళం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.