News September 12, 2024

సోంపేట: అదుపుతప్పి పంటపొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

image

శ్రీకాకుళం నుంచి ఇచ్ఛాపురం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు గురువారం అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకుపోయింది. 20 మంది ప్రయాణీకులతో శ్రీకాకుళం నుంచి బయలుదేరిన బస్సు సోంపేట మండలం మామిడిపల్లి గ్రామం సమీపంలో ఒక్కసారిగా అదుపుతప్పింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న ప్రయాణీకులకు ఎటువంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఘటనకు గల కారణాలు తెలియరాలేదు.

Similar News

News September 14, 2025

శ్రీకాకుళం: కొత్తమ్మ జాతరలో వీడియో పోటీలు

image

కోటబొమ్మాళి కొత్తమ్మ తల్లి జాతర ఈ నెల 23 నుంచి 25 వరకు ఘనంగా జరగనుంది. అమ్మవారి చరిత్ర, తదితర విషయాలను వీడియో రూపంలో చూపేందుకు పోటీలు నిర్వహించనున్నట్లు DRO వెంకటేశ్వరరావు శనివారం తెలిపారు. వీడియో 3 నుంచి 5 నిమిషాల నిడివితో పాటు ఆకర్షణగా ఉండలాని చెప్పారు. 16 తేదీ లోపు dsdosrikakulam@apssdc.in కు వీడియోలను పంపాలని ఆయన పేర్కొన్నారు.

News September 14, 2025

శ్రీకాకుళం జిల్లాకు భారీ వర్ష సూచన

image

వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో రానున్న మూడు రోజులు శ్రీకాకుళం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తరాంద్ర జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని, శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులు సముద్రం మీద వేటకు వెళ్లవద్దని సూచించారు. అల్ప పీడన ప్రభావం వలన సముద్రంలో రాకాసి అలలు ఎగసి పడతాయని హెచ్చరించారు.

News September 13, 2025

శ్రీకాకుళం జిల్లా మీదుగా ప్రత్యేక రైళ్లు

image

ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా శ్రీకాకుళం రోడ్, పలాస మీదుగా మధురై(MDU), బరౌని(BJU) మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. నంబర్ 06059 MDU- BJU ట్రైన్‌ను SEPT 17- NOV 26 వరకు ప్రతి బుధవారం నడుస్తుందన్నారు. నం.06060 BJU- MDU ట్రైన్‌ను SEPT 20-NOV 29 వరకు ప్రతి శనివారం సేవలు అందిస్తుందన్నారు. ఈ ట్రైన్లు ఏపీలో విజయనగరం, దువ్వాడ, విజయవాడతో పాటు పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయన్నారు.