News January 2, 2025
సోంపేట: చేతిలో మందు గుండు సామగ్రి పేలి ఒకరికి గాయాలు

సోంపేట మండల కేంద్రంలోని స్థానిక బీఎస్ కాలనీ వద్ద మంగళవారం రాత్రి నూతన సంవత్సర వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. స్థానికంగా ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్న ఉమా బెహరా మందు గుండు సామగ్రి కాలుస్తుండగా ప్రమాదం జరిగింది. చేతిలో బాంబు పేలిపోవడంతో అతని కుడి అరచేయి నుజ్జు నుజ్జు అయింది. వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికత్స కోసం అతణ్ని బుధవారం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు.
Similar News
News October 14, 2025
రైల్వే స్టేషన్‌లో చిన్నారిని విడిచిన గుర్తుతెలియని వ్యక్తులు

ఇచ్ఛాపురం రైల్వే స్టేషన్‌లో గుర్తు తెలియని వ్యక్తులు ఓ చిన్నారిని విడిచిపెట్టి వెళ్లిపోయిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఇచ్ఛాపురం రైల్వే స్టేషన్ ఫ్లాట్‌ఫామ్‌పై ఓ వ్యక్తికి పాపని చూడమని, టాయిలెట్‌కి వెళ్లి వస్తామని ఓ మహిళ అప్పగించి వెళ్లిపోయారు. తిరిగి ఆ వ్యక్తి రాకపోవడంతో GRP పోలీసుల సహకారంతో పలాస రైల్వే స్టేషన్‌లో చైల్డ్ హెల్ప్ డెస్క్‌కు చిన్నారిని అప్పగించారు.
News October 14, 2025
ఎచ్చెర్ల: ‘పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో 42 శాతం ప్రవేశాలు’

రాష్ట్రవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలకు నిర్వహించిన ఏపీ పీజీ సెట్ -2025 రెండో విడత కౌన్సిలింగ్ అలాట్మెంట్లను కన్వీనర్ ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు సోమవారం ప్రకటించారు. డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విద్యాలయంలో 19 పీజీ కోర్సుల్లో 600 సీట్లు ఉండగా 253 ప్రవేశాలు జరిగాయన్నారు. 42% ప్రవేశాలు మాత్రమే జరిగాయి. కనీసం పీజీ కోర్సులో 50% ప్రవేశాలు జరగకపోవటం గమనార్హం. కొన్ని కోర్సుల్లో కనీస ప్రవేశాలు జరగలేదు.
News October 14, 2025
పొందూరు: కరెంట్ షాక్‌తో ఎలక్ట్రిషీయన్ మృతి

కరెంట్ షాక్‌తో ఓ ఎలక్ట్రీషియన్ మృతిచెందిన ఘటన పొందూరు మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు వివరాలు మేరకు.. మండలంలోని పుల్లాజీపేట గ్రామానికి చెందిన ఉమామహేశ్వరరావు (39) ఎలక్ట్రిషీయన్‌గా జీవనం సాగిస్తున్నారు. సోమవారం ఇంట్లో ఎలక్ట్రానిక్ మరమ్మతులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగలడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. శ్రీకాకుళంలో ఓ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతునికి భార్య, కుమార్తె ఉన్నారు.