News January 2, 2025

సోంపేట: చేతిలో మందు గుండు సామగ్రి పేలి ఒకరికి గాయాలు

image

సోంపేట మండల కేంద్రంలోని స్థానిక బీఎస్ కాలనీ వద్ద మంగళవారం రాత్రి నూతన సంవత్సర వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. స్థానికంగా ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్న ఉమా బెహరా మందు గుండు సామగ్రి కాలుస్తుండగా ప్రమాదం జరిగింది. చేతిలో బాంబు పేలిపోవడంతో అతని కుడి అరచేయి నుజ్జు నుజ్జు అయింది. వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికత్స కోసం అతణ్ని బుధవారం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు.

Similar News

News January 14, 2025

SKLM: ఈ నెల 20లోగా డోనర్ పాసులకు పేర్లు నమోదు ఆఖరి

image

వచ్చే నెల 4వ తేదీన అరసవల్లిలో జరగనున్న రథసప్తమి(సూర్య జయంతి) రోజున దాతలు దర్శనం చేసుకునే వారు డోనర్ పాసులకు పేర్లు నమోదు చేసుకోవాలని ఈవో యర్రంశెట్టి భద్రాజీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల దేవాలయానికి రూ.లక్ష పైబడి విరాళం సమర్పించిన దాతలు ఈ నెల 20వ తేదీ లోగా డోనర్ రసీదుతో పాటుగా ఆధార్ కార్డుతో ఆలయానికి వచ్చి పేర్లు నమోదు చేసుకోవాలని ఈవో సూచించారు.

News January 14, 2025

శ్రీకాకుళం: పండగ పూట కుటుంబంలో విషాదం

image

టెక్కలి హైవేపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పెద్దసాన గ్రామానికి చెందిన జి. అప్పారావు <<15148221 >>మృతి <<>>చెందిన విషయం తెలిసిందే. ఈయన విశాఖలో కూలి పనులు చేస్తూ కుటుంబంతో జీవనం సాగించేవాడు. పండగకు సోదరిని పిలిచేందుకు ఆదివారం గ్రామానికి వచ్చాడు. తిరిగి వెళ్తున్న క్రమంలో రోడ్డు దాటుతుండగా HYD వెళ్తున్న బస్సు ఢీకొంది. దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News January 14, 2025

శ్రీకాకుళం: కొట్లాట ఘటనలో నలుగురిపై కేసు నమోదు

image

శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం తిర్లంగిలో సోమవారం జరిగిన కొట్లాట ఘటనలో ఇరువర్గాలకు చెందిన నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గ్రామానికి చెందిన జీ.చిట్టిబాబు, ఎస్.విశ్వనాథం మధ్య నెలకొన్న చిన్నపాటి వివాదం కొట్లాటకు దారి తీసింది. దీంతో వారు కర్రలతో దాడి చేసుకున్నారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన వారిపై చర్యలు తీసుకుంటామని సీఐ ఏ.విజయ్ కుమార్ తెలిపారు.