News February 28, 2025
సోంపేట: భర్త చితికి భార్య దహన సంస్కారాలు

సోంపేట మండలం హుకుంపేటలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పెద్దింటి జానకి రావు గురువారం గుండెపోటుతో మరణించారు. మృతునికి ఇద్దరు ఆడపిల్లలు ఉండడంతో.. భర్త చితికి భార్య దహన సంస్కారాలు చేశారు. ఈ దృశ్యం చూసిన స్థానికులు కన్నీటిపర్యంతమయ్యారు.
Similar News
News February 28, 2025
ఎచ్చెర్ల: డిగ్రీ 6 వ సెమిస్టర్ షెడ్యూల్ విడుదల:

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ 6 వ సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ ఇంటర్న్ షిప్ షెడ్యూల్‌ను యూనివర్సిటీ డీన్ జి.పద్మారావు శుక్రవారం విడుదల చేశారు. వీటి ఫీజుకు ఎటువంటి అపరాధరుసుం లేకుండా మార్చి 13వ తేదీ వరకు చెల్లించవచ్చని తెలియజేశారు. ఈ ఇంటర్న్‌షిప్ వైవా మార్చి 18వ తేదీ నుండి 25వ తేదీ వరకు ఉంటాయని చెప్పారు.
News February 28, 2025
SKLM: ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి సారించాలి: DM&HO

ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని DM &HO డాక్టర్ టీవీ బాలమురళీకృష్ణ అన్నారు. శుక్రవారం తన పర్యటనలో భాగంగా శ్రీకాకుళంలోని ఆదివారంపేట పట్టణ ఆరోగ్య కేంద్రం పరిధిలో జరిగిన ఎఫ్.ఎం.ఎం కిట్లు పంపిణీలో పాల్గొన్నారు. ఫైలేరియా ( బోదకాలు) రోగులకు పలు సూచనలు చేశారు. రోగులకు ఫైలేరియా మార్బులిటి మేనేజ్మెంట్ కిట్లతో కలిగే ఉపయోగాలను ఆయన వివరించారు.
News February 28, 2025
శ్రీకాకుళం: వీర జవాన్‌కు ప్రభుత్వం రూ.5 లక్షల రివార్డు

సంతబొమ్మాళి మండలం చెట్ల తాండ్ర గ్రామానికి చెందిన డొక్కరి రాజేశ్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల రివార్డ్ ప్రకటించింది. గతేడాది జులై 15న జమ్మూకశ్మీర్ దొడా జిల్లాలో ఉగ్రవాదుల దాడిలో డొక్కరి రాజేశ్ గాయాల పాలై చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు బాధిత కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచి రూ.5 లక్షలు రివార్డును ప్రకటిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.