News April 2, 2025

సోంపేట: రైలు ఢీకొని గుర్తు తెలియని మహిళ మ‌ృతి

image

శ్రీకాకుళం జిల్లా సోంపేట రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని మహిళ మృతి చెందినట్లు జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ డి హరినాథ్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఓ రైలు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగనట్లు ఆయన చెప్పారు. ఆమె వయసు 40 నుంచి 45 సంవత్సరాలు ఉంటుందన్నారు. వివరాలు తెలిస్తే ఈ నంబర్‌ను 9989136143 సంప్రదించాలని ఆయన చెప్పారు.

Similar News

News April 10, 2025

నరసన్నపేట : ముగ్గుల పోటీల్లో రూ. 25 లక్షల ప్రైజ్ మనీ

image

ముగ్గుల పోటీలలో నరసన్నపేటకు చెందిన మహిళ రూ.25 లక్షలు గెలుచుకున్నారు. ఆంధ్రా అమెరికన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం ఆన్‌లైన్‌ విధానంలో పోటీలు నిర్వహించారు. ఇందులో సునీత మొదటి బహుమతిని గెలుచుకున్నారు. లక్షల రూపాయలు గెలుచుకోవడంతో ఆమె ఆనందానికి అవధులు లేవు.  

News April 10, 2025

మెళియాపుట్టి: విషం తాగి వృద్ధుడు ఆత్మహత్య

image

మండలంలోని జర్రిభద్ర గ్రామానికి చెందిన దుంపల సూర్యనారాయణ (82) మంగళవారం సాయంత్రం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గమనించి వైద్యం నిమిత్తం టెక్కలి ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్యం పొందుతూ మృతి చెందినట్లు బుధవారం ఎస్సై పి.రమేశ్ బాబు తెలిపారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మెళియాపుట్టి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 10, 2025

రెవెన్యూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్

image

గ్రామాల వారీగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ డా.స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. బుధవారం శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రీసర్వే పౌర సేవలపై రెవెన్యూ యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

error: Content is protected !!