News March 6, 2025
సోదరభావంతో పండుగలను జరుపుకుందాం: డీసీపీ

సోదరభావంతో పండుగలను జరుపుకుందామని సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా తెలిపారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని హన్మకొండ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో గురువారం పీస్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. హన్మకొండకు చెందిన వివిధ మతాల పెద్దలతో ఏర్పాటుచేసిన సమావేశంలో డీసీపీ మాట్లాడారు. ఇతర మతాలను గౌరవిస్తూ పండుగలను జరుపుకోవాలని డీసీపీ తెలిపారు. ఏసీపీ, ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.
Similar News
News March 23, 2025
మొబైల్ కొనేటప్పుడు ఇది చూస్తున్నారా?

ప్రస్తుతం ఫోన్ కొనేటప్పుడు అందరూ అంటుటు (anTuTu) స్కోర్ చూస్తున్నారు. ఫోన్ స్పీడ్, గ్రాఫిక్స్, ర్యామ్, యూజర్ ఎక్స్‌పీరియన్స్ వంటివాటిని పరిశీలించి ఒక నంబర్ ఇస్తారు. దీనినే అంటుటు అంటారు. ఈ స్కోర్ ఎంత ఎక్కువ ఉంటే ఆ ఫోన్ అంత పవర్‌ఫుల్ అని అర్థం. ఎలాంటి గేమ్స్ ఆడినా ఫోన్ హ్యాంగ్ కాదు. ప్రస్తుతం ఐకూ13 మొబైల్ 26,98,668 స్కోర్‌తో టాప్‌లో, రెడ్ మ్యాజిక్ 10 ప్రో ఫోన్ 26,66,229తో సెకండ్ ప్లేస్‌లో ఉంది.
News March 23, 2025
కృష్ణా: బీసీ, కాపు కార్పొరేషన్ రుణ దరఖాస్తుల స్వీకరణ గడువు పెంపు

బీసీ కార్పొరేషన్ రుణాల దరఖాస్తుల స్వీకరణ తేదీని ఈనెల 25వ తేదీ వరకు పొడిగించినట్టు బీసీ కార్పొరేషన్ కృష్ణా జిల్లా ఈడీ శంకరరావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. అర్హులైన బీసీ, ఈబీసీ, కాపు, కమ్మ, రెడ్డి, ఆర్యవైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ, కాపులు ఈనెల 25వ తేదీలోపు AP-OBMMS ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని కోరారు.
News March 23, 2025
ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎంపీ, ఎమ్మెల్యే

గుంతకల్లు ఈద్గా మైదానంలో ఉపవాస దీక్షాపరులకు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఆధ్వర్యంలో ఆదివారం ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అనంతపురం జిల్లా ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ హాజరయ్యారు. ముందుగా మసీదులో సామూహిక ప్రార్థనలో నిర్వహించారు. అనంతరం ఉపవాస దీక్షాపరులకు ఫలహారాలు ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఉపవాస దీక్షపరుల కోసం ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందును ఎమ్మెల్యే, ఎంపీ ప్రారంభించారు.