News April 16, 2025
సోనాల: పురుగు మందు తాగి ఒకరి సూసైడ్

సోనాల మండలం సంపత్ నాయక్ తండాకి చెందిన జాదవ్ దేవిదాస్(45) పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఐ ప్రవీణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. తండాకి చెందిన దేవదాస్ మద్యానికి బానిసయ్యాడు. భార్య మందలించడంతో మనస్తాపం చెంది వ్యవసాయ పొలంలో పురుగు మందు తాగాడు. బోథ్ CHCకి అక్కడి నుంచి ADB రిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. కేసు నమోదైంది.
Similar News
News December 20, 2025
గ్రామ పంచాయతీల అభివృద్ధి మీ బాధ్యతే: కలెక్టర్

గ్రామ పంచాయతీల అభివృద్ధి బాధ్యత నూతన సర్పంచులదేనని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. నార్నూర్ పంచాయతీ సర్పంచిగా తన కూతురు బాణోత్ కావేరి గెలుపొందడంతో సర్పంచుల సంఘం రాష్ట్ర మాజీ కార్యదర్శి గజానంద్ నాయక్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావుతో కలిసి శుక్రవారం కలెక్టర్‌ను శాలువాతో సత్కరించారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలు చేసిన నీతి అయోగ్ కార్యక్రమానికి నార్నూర్ మండలం ఎంపిక కావడం గొప్ప విషయమన్నారు.
News December 19, 2025
ఆదిలాబాద్: వ్యవసాయ సమస్యలపై కలెక్టర్ చర్చ

ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా శుక్రవారం కలెక్టరేట్ సమావేశంలో రైతులు, సంబంధిత అధికారులతో కలిసి సొయాబిన్ పంట కొనుగోళ్లు, ఫర్టిలైజర్ బుకింగ్ యాప్, ఇతర వ్యవసాయ సమస్యలపై సమగ్ర చర్చ నిర్వహించారు. సమావేశంలో రైతుల తరపున పలువురు నాయకులు మార్కెట్లో సొయాబిన్ పంట కొనుగోలు సమయంలో ఎదుర్కొంటున్న సమస్యలు, అధిక వర్షాల కారణంగా పంట రంగు మారడం, మద్దతు ధర ప్రకారం రైతులను ఆదుకోవాలన్న అంశాలను వివరించారు.
News December 19, 2025
22న విపత్తు నిర్వహణపై ‘మాక్ ఎక్సర్సైజ్’

జిల్లాలో విపత్తుల నిర్వహణకు యంత్రాంగం అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. ఈనెల 22న నిర్వహించనున్న విపత్తు నిర్వహణ ‘మాక్ ఎక్సర్సైజ్’ను విజయవంతం చేస్తామని పేర్కొన్నారు. శుక్రవారం ప్రకృతి వైపరీత్యాల నివారణ చర్యలపై సీఎస్ శాంతి కుమారి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. విపత్తుల సమయంలో ప్రాణ, ఆస్తి నష్టాలను తగ్గించేందుకు ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉన్నామని అన్నారు.


